సెప్టెంబ‌ర్ 7 నుంచి కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌

Publish Date:Aug 19, 2022

Advertisement

దేశంలో అన్ని వ‌ర్గాల‌వారిని ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌ను త‌లపెట్టిం ది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న తన ప్రతిష్టాత్మకమైన భారత్ జోడో యాత్రలో పౌర సమాజాన్ని భాగ స్వామ్యం చేయాలని కోరుతూ, పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, మేధావులు, రచయితలతో ఆగస్టు 22న కాంగ్రెస్ సమావేశం కానుంది.  ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో సెప్టెంబరు 7న ఈ యాత్రను ప్రారంభిం చనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3,571 కి.మీటర్ల మేర 68 లోక్‌ సభ నియో జక వర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్‌ పాదయాత్ర సాగనుంది. 

దేశ రాజధానిలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో దాదాపు 150 మంది పౌర సమాజ ప్రతినిధులతో కాంగ్రెస్ సమా వేశాన్ని నిర్వహించనుందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు సెప్టెంబరు 23న, యాత్రకు అంకితమైన పార్టీ లోగో, నినాదం మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. దాదాపు 3500 కి.మీ పొడవునా దాదాపు 150 రోజుల్లో పూర్త వుతుంది. రాహుల్‌తో సహా కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది నాయకులు పాదయాత్రలో పాల్గొం టారు. అలాగే రాష్ట్ర యూనిట్ నాయకులు కూడా  చేరనున్నారు. కాగా, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో యాత్ర దాదాపు 15-20 రోజు ల పాటు కొనసాగు తుం దని అంచనా. ఇతర రాష్ట్రాలు మూడు నుంచి ఐదు రోజుల్లో యాత్ర ముగించ వ‌చ్చు.

అనారోగ్య కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 7న జరగనున్న పాదయాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదు. ఆమె కోవిడ్‌-19తో బాధపడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తు తం ఆమె ఐసొలేష‌న్‌లో ఉన్నారు.

విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనపక్షాల తరఫున కొనసాగనున్న ఈ జోడోయాత్ర గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మీడియాకు వివరించారు. రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి కేఎస్‌ అళగిరి నేతృ త్వం వహించగా, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లు దినేష్‌ గుండూరావు, సిరివళ్ల ప్రసాద్‌, సీనియర్‌ నేతలు కుమరి అనంతన్‌, ఈవీకే ఎస్‌ ఇళంగోవన్‌, తంగబాలు, పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ జయకుమార్‌, డాక్టర్‌ చెల్లకుమార్‌, తిరు నావుక్కరసు, జ్యోతిమణి, ఎమ్మెల్యేలు సెల్వం పెరుందగై, రూబీ మనోహరన్‌, రాజేష్‏కుమార్‌ విజయ తరణి, ప్రిన్స్‌, టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, ఎస్‌ఏ వాసు, జిల్లా అధ్యక్షులు  జె.ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేఎస్‌ అళగిరి, గుండూరావు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 4 రోజుల పాటు సాగే పాదయాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని 76 కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సెప్టెం బరు 7వ తేదీ కన్యాకుమారిలో రాహుల్‌గాంధీ అక్కడున్న కామరాజర్‌ మండపంలో నివాళులర్పి స్తారని తెలిపారు. అక్కడి నుంచి 3 కి.మీటర్ల మేర పాదయాత్ర చేస్తారన్నారు. 

పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభలోనూ ప్రసంగిస్తారని తెలిపారు. 8వ తేదీ ఉదయం కన్యాకుమారి నుంచి కల్యక్కావలై వరకు సుమారు 60 కి.మీ దూరాన్ని సుమారు 3 రోజుల్లో అధిగమిస్తారన్నారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివ రించారు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.