నెహ్రూను దాటేసిన మోడీ

Publish Date:Jun 10, 2026

Advertisement

దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా పదవిలో కొనసాగిన రికార్డు ఇప్పడు నరేంద్రమోడీ పేరు మీద ఉంది. ఇప్పటి వరకూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ తిరగరాశారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, కేంద్రంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా దేశానికి సేవలు అందించిన ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ  రికార్డును మోదీ   బద్దలు కొట్టారు.

ఈ చారిత్రక ప్రస్థానంలో సరిగ్గా బుధవారం (జూన్ 10) నాటికి నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.  బుధవారం (జూన్ 10) తో ప్రదాని మోడీ నెహ్రూను అధిగమించారు.  భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా సేవలు అందించినప్పటికీ..  ఆమె   నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగలేదు. కానీ మోదీ మాత్రం 2014, 2019,2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు చారిత్రాత్మక విజయాలను అందుకొని, నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.

ఈ అద్భుతమైన ఘనతను..  అలాగే కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక  భారత్ మండపం లో ఏర్పాటు చేసిన  ఉన్నత స్థాయి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.  ఆయనతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్  తదితరులు కూడా హాజరయ్యారు. అలాగే.. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల అధినేతలు  ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకున్న ప్రధాని మోదీకి ఘనంగా అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో గత 12 ఏళ్ల ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ మరియు రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించారు. 

By
en-us Political News

  
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.