Publish Date:Dec 27, 2024
సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు.
Publish Date:Dec 27, 2024
దిగ్గజ పారిశ్రామిక సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ మాజీ సీఈవో ఒసాము సుజుకి క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు.
Publish Date:Dec 27, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
Publish Date:Dec 27, 2024
మాజీ మంత్రి , వైసీపీ కీలక నేత పేర్ని నాని ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు.
Publish Date:Dec 27, 2024
టాలివుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Publish Date:Dec 27, 2024
ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.
Publish Date:Dec 27, 2024
అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పెద్దిరెడ్డి పాపాల పుట్టలు అన్నీ పగులుతున్నాయి. వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.
Publish Date:Dec 26, 2024
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు.
Publish Date:Dec 26, 2024
మాజీ ప్రధాని మన్మోహన సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం (డిసెంబర్ 26) ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ గా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Publish Date:Dec 26, 2024
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపై రద్దీ ఎక్కువగా ఉంది.
Publish Date:Dec 26, 2024
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికలో బిజెపికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బిజెపిని బలపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు.
Publish Date:Dec 26, 2024
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది.
Publish Date:Dec 26, 2024
కామారెడ్డిలో జిల్లాలో ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి , కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ సదాశివనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి