అధికార కాంగ్రెస్‌లో అనైక్యత..సభలో బహిర్గతం

Publish Date:Feb 25, 2012

Advertisement

హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లో అనైక్యత కనిపిస్తోంది. సమస్య ఎదురైనపుడు ఎవరి దారి వారిదేనన్న విషయం శాసనసభ సమావేశాల్లో బహిర్గతమవుతోంది. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే దాడిని మంత్రులు, అధికార పార్టీ సభ్యులు ఉమ్మడిగా ఎదుర్కోవలసి ఉండగా, చాలామంది తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కీలకమైన అంశాలపై సభలో చర్చ జరుగుతున్న సమయంలోనూ పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లాబీల్లోనే తిరుగుతున్నారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఉండేటట్టు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు నానా అవస్థలు పడుతున్నారు.  సభలో పట్టుమని పాతికమంది ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదు. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసినపుడు ఒకరిద్దరు మంత్రులు వినా మిగిలిన మంత్రులు, పార్టీ  ఎమ్మెల్యేలు పెద్దగా స్పందించటం లేదు. ముఖ్యమంత్రే చూసుకుంటారులే అన్న ధోరణితో వారున్నారు. ప్రతిపక్షాలు  వ్యక్తిగతంగా తమ మీద విమర్శలు చేస్తే మాత్రం మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం సభ పట్ల  ఆసక్తి చూపించడం లేదు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికారపక్ష సభ్యులు విమర్శలు చేసినపుడు ఆయనకు మద్దతుగా టిడిపి  సభ్యులంతా లేచి నిలబడటం, పదేపదే పోడియం వద్దకు దూసుకుపోవడం వంటివి చేస్తున్నారు. అదే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం మీదగాని, ముఖ్యమంత్రి మీదగాని విమర్శలు చేసినపుడు అధికార పక్ష సభ్యులు ఉత్సాహంగా లేచి నిలబడటానికి, ప్రతిపక్షంపై ఉమ్మడిగా ఎదురుదాడి చేయడానికి ఏమాత్రం ఉత్సాహం చూపటం లేదు. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎదుర్కోవడంలో మంత్రులు కూడా సమష్టి బాధ్యత తీసుకోకపోవడం ఆశ్చర్యం  కలిగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు అంటున్నారు. ‘మనమీదకి వస్తే చూసుకుందాం. లేనిపోని గొడవలు  మనకెందుకు’ అన్న ధోరణి మంత్రుల్లో వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన సభలో ఉంటే  ఎమ్మెల్యేలు తమ సీట్లోంచి కదలడానికే భయపడే వారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి బయటికి రావాల్సి వస్తే కొందరైతే  వైఎస్సేకి చెప్పి బయటికి వెళ్ళేవారు. సభలో సక్రమంగా కూర్చోని సభ్యుల్ని వైఎస్ స్వయంగా పిలిచి మందలించే వారు. పైగా సభ ప్రారంభ సమయానికి సభ్యులందరూ వచ్చి తమస్థానాల్లో కూర్చునే వారు.


ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో నలభైమందికి పైగా మంత్రులున్నారు. శాసనసభ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుండగా శాసనమండలి సమావేశాలు పది గంటలకు ప్రారంభం అవుతాయి. మంత్రులు రెండు సభలకు వెళ్ళాల్సి ఉంటుంది. అందువల్ల మంత్రులను ఎ, బి గ్రూపులుగా విడదీసి ఒకరోజు ఒక గ్రూపు మండలిలో, మరో గ్రూపు శాసనసభలో ఉండేట్టు కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే ఉభయ సభలు జరుగుతున్న సమయంలో సగంమంది మంత్రులు శాసనసభలో, సగంమంది మంత్రులు శాసనమండలిలో ఉంటారు. అయితే ఇరవై మందికి పైగా మంత్రులు శాసనమండలికి హాజరు కావలసి ఉండగా శుక్రవారం ఒక సమయంలో కనీసం ఒక్క మంత్రి కూడా సభలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. దీంతో మంత్రులు లేక సభను పది నిముషాలు చైర్మన్ వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చట్ట సభల పట్ల మంత్రులు ఎంత బాధ్యగా వ్యవహరిస్తున్నారన్న దానికి ఈ సంఘటనే నిదర్శనం.

By
en-us Political News

  
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.