వేధించే బదులు కాల్చి చంపవచ్చు కదా..జగన్
Publish Date:Jan 24, 2012
Advertisement
గుంటూరు: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కుమ్మక్కై తననూ తన కుటుంబాన్నీ, తనకు బాసటగా నిలిచిన వారిని వేధిస్తున్నాయని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల ఓదార్పు యాత్రలో పాల్గొన్న జగన్, దాచేపల్లి సభలో మాట్లాడుతూ ఇలా మానసికంగా వేధించే బదులు తనను, తన కుటుంబాన్ని కాల్చి చంపేయవచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అలా అనేసరికి అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా మంగళవారం జగన్ దూరపు బంధువైన సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. జగన్ ఆస్తులతోపాటు ఎమ్మార్ కేసు విషయంపైనా సునీల్ రెడ్డిని ప్రశ్నించాయి. ఈ నేపధ్యంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ అరెస్టు ఇక ఎంతో దూరంలో లేదని ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/congress-24-11213.html





