వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై టెక్కలి పీఎస్ లో ఫిర్యాదు

Publish Date:Nov 18, 2024

Advertisement

వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే..  దివ్వెల మాధురితో ఆయన సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కనిపిస్తోంది. ఆయన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టెక్కలి పోలీసు స్టేషన్ లో జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్  ఫిర్యాదు చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై   అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.  పవన్ కల్యాణ్ పైనా, ఆయన  కుటుంబం దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టులకు వెళ్లినా కూడా ఊరట లభించడం లేదు. ఇష్ఠారీతిగా నోరు పారేసుకుని శిక్షించవద్దంటూ కోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ఏపీ హైకోర్టు కూడా ఇటీవల వ్యాఖ్యానించింది. రామ్ గోపాల్ వర్మ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయిస్తే.. తరువాత అవసరమనుకుంటే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోండి, అంతే కానీ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేయలేమని కోర్టు విస్పష్టంగా చెప్పింది.

అలాగే సోషల్ మీడియా వ్యాఖ్యలపై అరెస్టులను ఆపాలంటూ సీనియర్ జర్నలిస్టు విజయబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగానూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఇప్పుడు  కోర్టును ఆశ్రయించి ఏం లాభం అంటూ చీవాట్లు పెట్టింది. న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసింది. దీంతో అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు, వైసీపీ నేతలకు ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలిలో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఆయనకు కూడా నేడో రేపో పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.  

By
en-us Political News

  
సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియోటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారంటూ తెలుగుదేశం రాష్ట్ర తెలుగుయువత ప్రతినిథి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.
గత వైసీపీ  ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది.  మాజీ మంత్రి విడదల రజిని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి ఏకంగా ప్రభుత్వ భూమిని కాజేసాడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డిపై కేసు నమోదైంది.
శ్రీవాణి ట్రస్ట్  కొనసాగింపు విషయంలో టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణల నేపథ్యంలో టిటిడి  మొదటి పాలకమండలి  సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.రోజూ ఎక్కడో అక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం అయ్యాయని, బ్యాంక్ వారు చేతులెత్తేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చిన తరువాత. ఈ నేరగాళ్లు మరీ విజృంభించేస్తున్నారు.
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు.
గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సనాతన సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ కుచెందిన జనసేన కార్యాలయం రోడ్డుపై అఘోరీ బైఠాయించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్, కేసీఆర్, కరణం బలరాంలు నారా చంద్రబాబునాయుడికి అత్యంత విధేయులుగా, ఇంకా చెప్పాలంటే ఆయనకు సూసైడ్ స్క్వాడ్ గా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు.
దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌‌గా డాక్టర్‌ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 18) శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.