జగన్‌కు సీబీఐకు ఒకే లాయర్.. డైరెక్టర్‌కు రఘురామ ఫిర్యాదు..
Publish Date:Oct 30, 2021
Advertisement
అరాచకాలకు కేరాఫ్ వైసీపీ సర్కార్ అనే విమర్శ ఉంది. జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయమూ వివాదాస్పదం అవుతోంది. అసలు జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కే లేదంటూ.. బెయిల్‌పై బయట ఉంటున్న ముఖ్యమంత్రిని మళ్లీ జైలుకే తరలించాలంటూ ఎంపీ రఘురామ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్‌కు పరోక్షంగా సాయపడుతున్న సీబీఐ తీరును తప్పుబడుతున్నారు రఘురామ. జగన్-సీబీఐ సహకారంపై తీవ్ర విమర్శలు వస్తుండగానే.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్‌రెడ్డి-వైసీపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదించే న్యాయవాది పి.సుభాష్‌ను.. సీబీఐ సైతం తమ లాయర్‌గా నియమించుకోవడం కలకలం రేపుతోంది. సీబీఐ తీరును ఎంపీ రఘురామ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆ నిర్ణయంపై నేరుగా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. జగన్మోహన్రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడాన్ని తప్పుబడుతూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు. ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందన్నారు రఘురామ. న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని లేఖలో డిమాండ్ చేశారు రఘురామ.
http://www.teluguone.com/news/content/complaint-against-cbi-lawyer-subhash-39-125538.html





