సమతామూర్తి సాక్షిగా వివక్ష.. చిన‌జీయ‌ర్‌పై విమ‌ర్శ‌..

Publish Date:Feb 14, 2022

Advertisement

నిజమే. శ్రీ రామానుజాచార్యులు ‘సమతా’ మూర్తి, సందేహం లేదు. వెయ్యేళ్ళ క్రితమే ఆయన కుల మత తారతమ్యాలు లేని సమాజ వ్యవస్థ కోసం కలలు కన్నారు. శ్రీ రామానుజులు సమతామూర్తి మాత్రమే కాదు. మనుషులంతా ఒక్కటే అని నమ్మిన మానవతామూర్తి. సమతా మంత్రాన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా పంచిన మేరునగ సమోన్నత సమతా శిఖరం శ్రీ రామానుజాచార్యులు.అంతటి మహనీయుని, సహస్రాబ్ది ఉత్సవాలను చిన జీయర్ స్వామి, హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్’లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామనగర్‌లో వందెకరాల ప్రాంగణంలో అద్వితీయ రీతిలో సమతామూర్తి విగ్రహాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించారు. ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. వేలాదిగా  భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. 

అయితే, 12 రోజులపాటు ఇంత వైభవంగా జరిగిన వేడుకలలో సమతా మూర్తి శ్రీరామానుజుల మూల సూత్రమే మరుగున పడిపోయిందని ఉత్సవాలలో పాల్గొన్న, తిలకించిన భక్తులు అవేదన, ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. శ్రీరామనుజుల వారు మనుషులు అందరినీ సమానంగా చూడాలన్నారు. అనడం కాదు ఆచరించి చూపారు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యారు. వెయ్యేళ్ళు అయినా ఇంకా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. ఆ ప్రేరణతో ఎందరో చేసిన సమర్పణలతోనే ఆధ్యాత్మిక సమతా కేంద్ర నిర్మాణం జరిగింది.  

అయితే, ఆయన శ్రీ రామానుజుల ఆశయాలను ముందుకు తీసుకు పోతున్నామని చెప్పు కుంటున్న చిన జీయర్ స్వామి, అందరిని సమానంగా చూశారా? పంక్తిలో వలపక్షం చూపారా? అంటే, కొందరిని ఒకలా, ఇంకొందరిని ఇంకోలా చూశారనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. స్వామీజీ, అతిధులకు తీర్థ, ప్రసాదాలు ఇచ్చే సమయంలో.. అయిన వారికి  ఆకుల్లో, కానీ వారికి కంచాల్లో అనట్లుగా పక్ష పాతాన్నిమ వివక్షను చూపారని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. నిజానికి చిన జీయర్ స్వామి ఎవరినీ ముట్టుకోరని, ఎవరినీ దగ్గరకు కూడా రానీయరనే ఆరోపణ లేదా నింద ఉండనే వుంది. అయితే అందుకు ఆయన కొంత వివరణ కూడా ఇచ్చారు.  ఏవో కారణాలు చెప్పారు. అయినా అదొక మచ్చగానే మిగిలి పోయింది. అదలా ఉంటే, ఇంతటి వేడుకల్లోనూ వివక్ష చూపడం ఏమిటనే, ప్రశ్న ప్రముఖంగా వినవస్తోంది. అందరి విషయంలో ఒకేలా ఉంటే అదో రకం, కానీ, ఒకే వేదిక పై కొందరిని ఒకలా ఇంకొందరిని ఇంకొకలా చూడడం వలన, సమతా మూర్తి సన్నిధిలోనే వారి సందేశానికి అవమానం జరిగిందనే బాధను భక్తులు వ్యక్త పరుస్తున్నారు. 

నిజానికి, గతంలో స్వామీజీ కొన్ని వర్గాల ప్రజల ఆహారపు అలవాట్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. స్వామీజీ కుల వివక్ష చుపుతున్నారనే  ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు, ఏకంగా మహా వేడుకలో, కడివెడు పాలలో ఒక్క విషం చుక్కలా సమతా మూర్తి సాక్షిగా, స్వయంగా చిన జీయర్ స్వామి అసమానతలు, వివిక్ష చుపారనే ఆరోపణలు వినవలసి రావడం అంతోటి స్వామికి జరిగిన అవమానంగానే భావించవలసి ఉంటుదని భక్తులు అంటున్నారు.
 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.