ప్రేయసి కోసం నేను పెట్టిన ఖర్చిది.. వసూలు చేయండి.. ఓ ప్రేమికుడి సూసైడ్ నోట్!
Publish Date:May 31, 2022
Advertisement
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. తొమ్మిదేళ్ల ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడి విషాదాంత సంఘటన ఇది. ప్రేయసి పెళ్లికి నిరాకరించడంతో ఆ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కోసం తాను ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఆమె దగ్గర నుంచి వసూలు చేయాలని తన సూసైడ్ నోట్ లో రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాకలోని చిక్ మగళూరులో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న విఫల ప్రేమికుడు 31 ఏళ్ల చేతన్. గత తొమ్మిదేళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ట్రక్ డ్రైవర్ గా పని చేసే చేతన్ తన జీతంలో సగానికి పైగా ప్రియురాలికోసమే ఖర్చు చేశాడు. తొమ్మది సంవత్సరాల తరువాత ఆమె తన ప్రేమను తిరస్కరించి పెళ్లికి నిరాకరించడంతో కుంగిపోయాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలి కోసం ఈ తొమ్మదిళ్లలో తాను ఖర్చు చేసిన మొత్తం నాలుగున్నర లక్షలని, ఆ ఖర్చు వివరాలన్నీ సూసైడ్ నోట్ లో రాసి, ఆ మొత్తాన్ని ఆమె దగ్గర నుంచి వసూలు చేయాలని పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ ఎంత మధురం అంటూ తొమ్మిదేళ్ల పాటు ప్రేయసితో ప్రేమయానం చేసిన యువకుడు ఆమె పెళ్టికి నిరాకరించడంతో తట్టుకోలేకపోయాడు.. ప్రియురాలు ఎంత కఠినం అంటూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించేశాడు. అయితే ఆత్మహత్యకు ముందు ఈ తొమ్మది సంవత్సరాలుగా ఆమె ఆనందం కోసం, ఆమె సంతోషం కోసం తాను ఎంత ఖర్చు చేశాడో వివరంగా లెక్కలు రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.
http://www.teluguone.com/news/content/collect-the-ammout-from-her-a-lovers-sucide-25-136778.html





