తెలంగాణలో కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ బ్యాన్
Publish Date:Oct 5, 2025
Advertisement
కోల్డ్రీఫ్ దగ్గు మందు సిరప్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరప్‌ను తెలంగాణలో బ్యాన్ చేస్తూ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. మరోవైపు ఈ దగ్గు సిరప్ ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధిత చిన్నారులకు ఇచ్చిన దగ్గు మందును ఈయనే సూచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అతడిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు.ఇదే సమయంలో, ఆ మందును తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసన్ ఫార్మా కంపెనీపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ పరీక్షల్లో ఆ కంపెనీ తయారు చేసిన సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరితమైన రసాయనమని, మానవ శరీరానికి హానికరమని అధికారులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
http://www.teluguone.com/news/content/coldreef-cough-syrup-36-207397.html





