వెయ్యి కోట్ల రూపాయల విలువైన కొకైన్ స్వాధీనం

Publish Date:May 27, 2026

Advertisement

భారతదేశ పశ్చిమ సముద్ర తీరప్రాంతంలో   భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు  రట్టయ్యింది. దేశ భద్రతా సంస్థల అప్రమత్తతతో గుజరాత్‌లోని కచ్ తీరంలో అత్యంత భారీ ఎత్తున సాగిన మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్ విజయవంతమైంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), భారత కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, దాదాపువెయ్యి కోట్ల రూపాయలకు పైగా   విలువైన  కొకైన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ  సమాచారంతో రంగంలోకి దిగిన రక్షణ దళాలు సముద్రం మధ్యలోనే స్మగ్లర్ల వ్యూహాలను చిత్తు చేశాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 100 కిలోలకు పైగా స్వచ్ఛమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిషేధిత మాదకద్రవ్యాలు విదేశాల నుంచి సముద్ర మార్గంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించేందుకు స్మగ్లర్లు   వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు.  

పాకిస్తాన్‌లోని పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరిన ఒక యూరోపియన్ నౌక (ఎంఎస్సీ జహాజ్) కచ్ తీరానికి సమీపంలోకి రాగానే, అక్కడ అనుమానాస్పద కదలికలు జరుగుతున్నట్లు గుజరాత్ ఏటీఎస్,  కోస్ట్‌గార్డ్ అధికారులు   పసిగట్టారు. భద్రతా దళాల బోట్లు తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించిన స్మగ్లర్లు, పట్టుబడతామనే భయంతో డ్రగ్స్ సంచులను సముద్రంలోకి విసిరేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే సముద్రంలో తేలుతున్న ఆ సంచులను అత్యంత సాహసోపేతంగా వెలికితీసిన అధికారులు..  వాటిని క్షుణ్ణంగా పరీక్షించారు. ఈ తనిఖీల్లో ఒక్కో క్యాప్సూల్‌లో 1.04 కేజీల చొప్పున ప్యాక్ చేసిన మొత్తం 84 డ్రగ్ క్యాప్సూల్స్ లభ్యమయ్యాయి. మొత్తం కొకైన్ బరువు దాదాపు 118 కిలోలుగా తేలింది. ఈ భారీ రవాణా వెనుక బ్రెజిల్  నుంచి సుమారు ఆరు నెలల క్రితమే లోడ్ అయిన అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ లింకులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బ్రెజిల్ నుండి కరాచీ మీదుగా భారత జలాల్లోకి ఈ డ్రగ్స్ ప్రవేశించాయని అధికారులు నిర్ధారించారు.

ఈ మెగా ఆపరేషన్ సందర్భంగా నౌక నుంచి   అంతర్జాతీయ స్మగ్లర్ జుమా నాసిర్ ఒమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు సముద్రంలోకి దూకి పరారయ్యాడు. పట్టుబడిన నిందితుడి సమాచారం ఆధారంగా ఢిల్లీలో ఈ కన్సైన్‌మెంట్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న కెల్విన్ చుక్వుమా, బైరుహంగా జేమ్స్ అనే ఇద్దరు విదేశీయులను సైతం భద్రతా సంస్థలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి అత్యాధునిక శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాన్ని కూడా సీజ్ చేశారు. ఈ డివైజ్ ఆధారంగా అంతర్జాతీయ మాఫియా ఏ మార్గాల్లో ప్రయాణించిందో, ఎవరెవరితో సంబంధాలు నెరిపిందో   విచారించేందుకు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  

By
en-us Political News

  
నాగోల్‌లో ఉన్న జగ్జీవన్‌రామ్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు రెండ్రోజుల వార్షిక సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్కసారిగా ఎబోలా వైరస్ భయాలు కలకలం రేపాయి.
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.