ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

Publish Date:May 1, 2026

Advertisement

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేమ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు:

ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చినందుకు కార్మిక సంఘాలను సీఎం అభినందించారు.“నేను వేరు – మీరు వేరు అనే భావన నాకు లేదు. అందరం కలిసే ప్రభుత్వం,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని, వారి పోరాటాల్లో తాము ఎప్పుడూ తోడుగా ఉన్నామని అన్నారు. ఆర్టీసీలో బస్సులు, నియామకాలు, ఆదాయం పెరిగాయని తెలిపారు. కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ దేశంలో ప్రముఖ సంస్థగా నిలిచిందని కొనియాడారు.

గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం డీజిల్‌పై సుమారు రూ. 2000 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులపై దృష్టి పెట్టామని వివరించారు.

ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ ప్రభుత్వ కాలానికి చెందినవి కాకపోయినా, వాటిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీఆర్‌సీ వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

రాజకీయ ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని కోరారు. ఒక డ్రైవర్‌ను కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని తెలిపారు. సంస్థ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని, డిపో మేనేజర్లతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అధికారులకు సూచించారు. 

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తున్నామని, ఈసారి రూ. 1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను శాతం 100 పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, కార్మికుల వెంట ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.“సంస్థ ఆగిపోతే అది ఊపిరి ఆగినట్లే. సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేయొద్దు,” అని సూచించారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలనీ, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, కేసులను వెంటనే ఎత్తివేయడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By
en-us Political News

  
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.