డీలిమిటేషన్‌పై కమిటీ ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
Publish Date:Apr 13, 2026
Advertisement
సీట్ల పునర్విభజనలో శాతం కాదు, సంఖ్యే ముఖ్యం. రాజకీయాల్లో కూడా నెంబర్లే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒకప్పుడు వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. నెంబర్లు లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు జరపరు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదని సీఎం పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పడింది. ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులు నియమితులయ్యారు. కానీ ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించబడలేదు. దీనివల్ల మహిళల పట్ల బీజేపీకి ఉన్న దృక్పథం అర్థమవుతుంది. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చింది. మహిళను అధ్యక్షురాలిగా నియమించిన తర్వాతే బండి సంజయ్ మాట్లాడాలని రేవంత్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి. మా ఎంపీలు తెలంగాణను సాధించారు, ఇప్పుడు పునర్విభజన విషయంలో కూడా పోరాడతారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంట్‌లో బిల్లు ఎలా ఆమోదిస్తారో చూస్తామని సీఎం తెలిపారు. 60 సంవత్సరాల్లో మహిళల కోసం కాంగ్రెస్ చాలా చేసింది. కానీ 46 సంవత్సరాల్లో బీజేపీ ఒక్క మహిళకు కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం బీజేపీ లక్షణం. స్వాతంత్ర్యం తీసుకురావడం, రాజ్యాంగం ఇవ్వడం, రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు దేశాన్ని కాపాడే బాధ్యత కూడా కాంగ్రెస్‌దే. సీట్ల పునర్విభజనలో యాభై శాతం పెంపు జరిగితే, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ప్రాధాన్యం ఉండదు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలకు ఈ విషయంపై లేఖ రాస్తానని అన్నారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనను కలిపి చూపిస్తూ ప్రతిపక్షాలపై తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు అంశాలు వేర్వేరు. వీటిని విడదీసి చర్చించాలి.రాజ్యాంగంలోనే మహిళలకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్. అప్పట్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్. ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బీజేపీ సహకరించకపోవడం వల్ల లోక్‌సభలో ఆమోదం కాలేదు.2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అయితే 2026 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చట్టం చేయడం ద్వారా ఆలస్యం చేస్తున్నారు. 2024లోనే అమలు చేస్తే 543లో 181 మంది మహిళలు ఎంపీలు అయ్యేవారు. పునర్విభజనను మహిళా బిల్లుతో కలపడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. 2026 జనాభా లెక్కల ఆధారంగా బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.గతంలో నియోజకవర్గాల పునర్విభజన మూడు సార్లు జరిగింది. 1967లో 520 సీట్లు, 1976లో 542 సీట్లు, తరువాత సిక్కిం కలవడంతో 543 అయ్యాయి. ఇందిరా గాంధీ జనాభా ఆధారంగా సీట్ల పెంపును 25 ఏళ్ల పాటు నిలిపివేశారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఇప్పుడు అదే ఆధారంగా సీట్ల పెంపు చేస్తే అన్యాయం జరుగుతుంది.యాభై శాతం పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇది దేశ ఐక్యతకు మంచిది కాదు.సీట్ల పునర్విభజనపై నేను హైబ్రిడ్ మోడల్‌ను సూచిస్తున్నాను. పెంచే సీట్లలో సగం ప్రోరేటా ప్రాతిపదికన, మిగతా సగం జీఎస్‌డీపీ ఆధారంగా కేటాయించాలి. దేశానికి ఎక్కువ ఆదాయం అందించే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. నిపుణులతో కమిటీ వేయాలి. అన్ని అసెంబ్లీల్లో చర్చించి, పార్లమెంట్‌లో ఆమోదించాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. తొందరపాటు నిర్ణయాలతో ఉత్తరాది-దక్షిణాది మధ్య అంతరాన్ని పెంచకూడదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-217272.html





