గీత దాటితే అరెస్ట్...కేసీఆర్‌కు రేవంత్ లక్ష్మణ రేఖ

Publish Date:Aug 10, 2025

Advertisement

 

కాళేశ్వరం నివేదికను ఒక అస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను అరెస్టు చేస్తారా ? కాళేశ్వరం ప్రాజెక్ట్’ నిర్మాణానికే కాదు, అందులో జరిగిన అవకతవకలకు, కర్త, కర్మ, క్రియ అన్నీ,ఆయనే అని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్’ నివేదిక తేల్చి చెప్పిన నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

నిజానికి,అరెస్టు చేయడమా, చేయక పోవడమా అనేది, విచారణ  కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు. రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం. అందుకే, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని,విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం   గతంలో కేసీఆర్’ ప్రభుత్వం తనను జైలుపాలు చేసిన చేదు అనుభవాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోలేదని ఇంతవరకు చెపుతూ వచ్చారు. అలాగే, తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని, సన్నిహితులు మాత్రమే కాదు, అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన శపధం గుర్తున్న అందరూ భావిస్తూ వచ్చారు.


అయితే,ఇటీవల ఢిల్లీ  మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చచ్చిన పామును ఇంకేం చంపుతాం,అన్నట్లు, ఇప్పటికే కేసీఆర్, ఫార్మ్ హౌస్’ లో స్వీయ’ బందీగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా జైలుకు పంపవలసిన అవసరం లేదు. ఇప్పడు ఆయనకు చర్లపల్లి జైలు అయినా, ఫార్మ హౌస్ అయినా ఒక్కటే’ , ఫార్మ్ హౌస్’ లో సంరక్షణ ఉంటుంది, చర్లపల్లి జైల్లో పహారా. ఉంటుంది .. అదొక్కటే తేడా.. కాబట్టి…
అంటూ, కేసీఆర్’ను జైలుకు పంపే ఆలోచన లేదనే ముఖ్యమంత్రి ఒక విధంగా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఒక విధంగా అదే తుది నిర్ణయం అనే భ్రమలను కల్పించారు. 

అయితే, అదే ప్రభుత్వ అంతిమ నిర్ణయమా లేక కేసీఆర్’ జనంలోకి రాకుండా, ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అరెస్ట్ ఉండదనే సంకేతాలు ఇచ్చారా,,అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్’ బయటకు రానంత వరకు అరెస్ట్’ ఉండదని కాదని కాలు బయట పెడితే మాత్రం ‘అరెస్ట్’ తప్పదనే సంకేతాలు ఇచ్చారా, అనే అనుమనాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో, ఇప్పటికిప్పడు కేసీఆర్’ను అరెస్ట్ చేస్తే,అందుకు  రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే అభిప్రాయం కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్త  మవుతోందని అంటున్నారు. మరో వంక కేసీఆర్’ ను అరెస్ట్ చేయడం వల్లనే కాదు,అరెస్ట్ చేయక పోవడం వలన కూడా కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయక పోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల అస్త్రంగా మలచు కున్నారు. 

‘బీజీపీ,బీఆర్ఎస్ ఒక్కటే’ నినాదాన్ని, జనంలోకి బలంగా తీసుకు పోయారు. అదే సమయంలో బీజేపీ ఆదిస్థానం బండి సంజయ్’ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్’ఆరోపణలకు మరింత బలం చేకూరి బీజేపీ మరింతగా నష్ట పోయిందని, ఇప్పటికీ రాజకీయ విశ్లేషణల్లో వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పటికి  కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూనే వుంది. అయితే, ఇప్పడు కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్, కేసుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేయక పోతే,కాంగ్రెస్ ప్రయోగించిన, ‘కుమ్ముక్కు’ అస్త్రాన్నే బీజేపీ ప్రయోగించే ప్రమాదం వుంది.

నిజానికి,బీజీపే సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించారు.కేసీఆర్’కు కాంగ్రెస్ అధిష్టానంతో డీల్ కుదిరిందని, ముడుపులు చేతులు మారుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సో .. ఒక విధంగాచూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో’ చెప్పలేమని అంటున్నారు.అలాగే, రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నివేదికను, అసెంబ్లీ ఇతర వేదికల ద్వారా బీఆర్ఎస్’ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ఉపయోగించుకుంటారే, కానీ, కేసీఆర్’ నే కాదు,ఆయన  కుటుంబం సభ్యుల్లో ఏ ఒక్కరి విషయంలోనూ విచారణలు అరెస్టుల వరకు పోరనే  అంటున్నారు. 

ముఖ్యంగా, రేవంత్ రెడ్డి లోపలి మనిషి తెలిసిన సన్నిహితులు, కనిపించినంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటారు.అందుకే రేవంత రెడ్డి బయటకు ఆవేశంగా రాజకీయం చేస్తున్నట్లుగా కనిపించిన,కీలక సమయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని, గత 18 నెలల పాలనలోనూ అదే వ్యూహాత్మకంగా,పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో  రాజకీయంగా లాభనష్టాలు వేసుకుని ముందడుగు వేస్తున్నారు.ఈ విషయంలో రేవంత్ రెడ్డి భవిష్యత్ వ్యూహాలు, నిర్ణయాలు చర్యలను ఊహించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.