దోచేశావు నాన్నా.. దోచేశావు!
Publish Date:Dec 11, 2023
Advertisement
నాన్న నాన్నే.. ఇంట్లో ఏ ఆడపిల్లకైనా.. నాన్నే హీరో.. గారాబం చేసినా.. బుజ్జిది, బుజ్జోడా అంటూ ముద్దులు కురిపించినా? ఎప్పడన్నా బడిత పూజ చేసినా ఆ ఆడపిల్లకు నాన్నే ఎవర్ గ్రీన్ రియల్ హీరో.. ఇంట్లో ఒక్కరే అయితే అదీ కూడా ఆడపిల్లే అయితే.. ఆ ఇంట్లో ఆ పాప కోసమే.. ఓ నాలుగు కంటిపాపలు నిత్యం అనుక్షణం పంచప్రాణాలుగా తపిస్తుండడమే కాదు.. పరితపించి పోతుంటాయి కూడా. సరిగ్గా అలాంటి పరిస్థితే నాది కూడానూ. మీ అనోన్య దాంపత్యానికి చిహ్నంగా.. మీ ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న నాపై మీరు చూపించిన ప్రేమానురాగాలు అద్బుతం, అనిర్వచనీయం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్నా.. నీలో ప్రశ్నించే తత్వం, మెండి పట్టుదల, దేనినైనా లక్ష్యంగా పెట్టుకొంటే.. దాని అంతు చూసే వరకు నిద్ర పోని తత్వం, అన్యాయాన్ని సహించలేని క్రమంలో కట్టలు తెంచుకొచ్చే ఆవేశం, అలాగే మీలో జెట్ స్పీడ్‌లో దూసుకు పోయే... చొచ్చుకు పోయే స్వభావం, అలాగే పేదలకు న్యాయం చేయడం కోసం మీరు పడిన... పడుతున్న శ్రమ ఎప్పటికి వృధా కాదని.. డిసెంబర్ 7వ తేదీన నాకు పూర్తిగా అర్థమైంది నాన్నా. నా వయస్సు పెరుగుతోన్న కొద్ది.. మీరు రాజకీయంగా ఎదుగుతోన్న కొద్ది.. మీరు మాతో గడుపుతోన్న సమయం ఇకపై దాదాపుగా తక్కువైపోతుందేమోననే ఓ విధమైన బెంగాతో మనస్సు కలత చెందుతున్నప్పుడు సైతం.. ప్రజల కోసం మీ తపన చూశాను. యూ ఆర్ రీయల్లీ గ్రేట్ నాన్నా. ఇక 2015, జూన్ 11న నా నిశ్చితార్థం సమయానికి కొద్ది రోజుల ముందు చోటు చేసుకొన్న పరిణామాలతో ఇంట్లో అందరం కుప్పుకూలిపోయాం నాన్నా.. ఇంట్లో ఒక్కగాని ఒక్క గారాల పట్టి అయిన నా నిశ్చితార్థానికి మీరు వస్తున్నారో? లేదోనంటూ.. మీ కోసం ఆ సమయంలో మేము పడిన ఆవేదన, మానసిక ఆందోళన వర్ణించలేనిది నాన్నా.. పైనున్న ఆ భగవంతుడు.. మంచి వాళ్లకు మంచే చేస్తాడని నమ్మకం ఉంది నాన్నా.. ఆయన కరుణా కటాక్షాలతో.. మీరు నా నిశ్చితార్థానికి హాజరైనప్పుడు.. ఆ సమయంలో... నేను పొందిన ఆ ఆనందాన్ని.. ఎలా వర్ణించాలి.. ఏమని వర్ణించాలో కూడా మాటలు రాలేదు నాన్నా... కానీ ఆ క్షణంలో మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం.. వచ్చావా నాన్నా.. నా కోసం వచ్చావా నాన్నా.. నీ గారాల పట్టి... మరో ఇంటిలో అడుగు పెట్టడం కోసం.. జరుగుతోన్న నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసి... బెంగపడకమ్మా.. నీకు నేనున్నానమ్మ.. నిశ్చితంగా ఉండమ్మ అంటూ నాకు ఓ విధమైన భరోసా కల్పించేందుకు వచ్చావని.. నా హృదయం ఆనందంతో ఆనందలాస్యం చేస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది నాన్నా... ఆ క్రమంలో నా కళ్లలో కన్నీరు సుడులు తిరిగినా. అంతలోనే ఇక్కడ వేడుక జరుగుతోందని.. ఇది సమయం కాదని మనస్సు మూగగా పదే పదే చెప్పడంతో.. వస్తున్న కన్నీటిని అదిమిపెట్టుకొన్నా నాన్నా.. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో మార్పు మొదలైందన్న విషయాన్ని నేను కాదు.. నా మనస్సు పసిగట్టింది నాన్నా.... ఆ క్రమంలో మీరు వేసి ప్రతి అడుగు.. మీ, మా భవిష్యత్తును క్రాంతి పథం వైపు నడిపిస్తుందనే ఓ చిగురుటాశ మొలకెత్తింది.. ఆ క్రమంలో ప్రజల కోసం పాటు పడే నాయకుడిగా ఎదుగుతున్న మీకు.. కాలమే అన్ని సమకూర్చింది నాన్నా.. అందుకే శతాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలో హేమామేహీలున్నా... మీరు ఆ పార్టీలో చేరిన స్వల్ప కాలంలోనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ శ్రేణులనే కాదు.. పార్టీ అధిష్టానం మనస్సుతోపాటు ప్రజల మనస్సును సైతం దోచుకున్నారు నాన్నా.. ఎంతో ఘన చరిత్ర ఉన్న పార్టీలో ఇలా చేరి.. అలా హాట్ సీట్.. సీఎం కూర్చిని అధిష్టించారంటే.. అదీ కూడా ఈ వయస్సులో.. మీరు.. మీ సంకల్పం.. మీ దైర్యం, మీ పట్టుదల, మీ పోరాట పటిమ, మీ వాక్చాతుర్యంతోపాటు అమ్మ అదృష్టం, నా పూర్వ జన్మ సుకృతం... ఇవన్నీ కలిస్తేనే.. కలబొస్తేనే నువ్వు అని చెబుతోంది నాన్నా మీ గారాల పట్టి నైమిషా మనస్సు.
http://www.teluguone.com/news/content/cm-revanth-daughter-emotion-25-166834.html





