కిరణ్ ను కలవరపెట్టిన జగన్ తో అసదుద్దీన్ భేటీ

Publish Date:Jun 20, 2012

Advertisement

ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు 2012 ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయభేరి రాష్ట్రంలో చర్నోపచర్చలకు దారితీశాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ తరుణంలో ఎం.ఐ.ఎం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెంచల్ గూడ జైలుకు వెళ్ళి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కలిశారు. జైలు అధికారుల నుంచి ములాఖాత్ అనుమతి పొందిన ఆయన జగన్ తో గంటసేపు గడిపారు. అప్పుడు జగన్ ఆరోగ్యపరిస్థితి, జైలువాతావరణం, సిబీఐ విచారణ తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయపరిణామాల గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చ నడిచింది. ఈ చర్చ రాజకీయసమీకరణల్లో ఏమైనా కొత్త అంకానికి తెరలేస్తుందన్న సందేహానికి తావిచ్చింది. భవిష్యత్తులో బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న ఎం.ఐ.ఎం., రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా ఎప్పుడైనా ఒప్పందం చేసుకోవటానికి ఈ సమయాన్ని జగన్, అసదుద్దీన్ ఉపయోగించుకోవచ్చనే కొత్త ఊహలకు ఆస్కారమేర్పడింది. అయితే ఈ ఊహలేమీ నిజం కాదన్నట్లు అసదుద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వమని జగన్ ను కోరానన్నారు. అయితే అసదుద్దీన్ 2014 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేందుకు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అయితే ఊహించని పరిణామాలు ఏమైనా జరిగితే తమను నినదించవద్దని ఆయన కోరారు. అంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఎం.ఐ.ఎం. జగన్ ను అసదుద్దీన్ కలిశాక మద్దతు ఉపసంహరించుకునే ఆలోచన కూడా చేయొచ్చని ఆ మాటలో గూఢార్థం బయటపడుతోంది, కాంగ్రెస్ బలం తగ్గితే తనవైపు చూస్తుందని జగన్ భావించి ఉండవచ్చని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా కొత్తబంధానికి తెరలేపేందుకు అసదుద్దీన్, జగన్ మిలాఖాట్ జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అదెంతవరకూ నిజమో తెరపైనే చూడాలి.

By
en-us Political News

  

సామాన్యుడైనా..ప్రముఖుడైనా ఎవరికైనా అమ్మ అమ్మే. మదర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ అమ్మకు పాదాభివందనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ

జడ్జీలు డబ్బులు తీసుకుని తీర్పులు ఇస్తున్నారంటూ న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై అటు సుప్రీంకోర్టులోను, ఇటు హైకోర్టులోను కోర్టు ధిక్కర

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు.

కేరళ :శబరిమల యాత్ర చివరి రోజున పొన్నాంబళంమేడు కొండల్లో అయ్యప్పస్వామి ౩ సార్లు మకర జ్యోతి రూపంలోదర్శనంతో భక్తులు పులకించిపొయారు.జ్యోతి దర్శనానికి  అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు.పోలీసులు,వైద్యశాఖ, ఆగ్నిమాపక విభాగం పులిమేడులో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. పంచలిమేడు,పరుంతుపరల నుంచి కూడా మకర జ్యోతిని స్పష్టంగా చూడగలిగారు.

NTR Shakti has 18 Previews – Truly a new Tollywood record – Indeed, for the first time in the history of Telugu cinema, NTR Shakti. Whether you call it a paid preview or a benefit show or NTR Shakti is coming out all guns blazing with a record of 18 previews in Mumbai, Chennai, Pune, etc

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.