పరకాలలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదా?

Publish Date:May 22, 2012

Advertisement

పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన సిఎం బహిరంగసభ గాలిదుమారం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇదీ ఒకందుకు మంచిదేనని, అసలు జనంలేని ఆ సభను చూసి మిగిలిన అభ్యర్థులు దుష్ప్రచారం చేయటానికి అవకాశమే లేకుండా పోయిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

 

గట్టిగా జనాన్ని తీసుకురాలేని స్థితికి కాంగ్రెస్ చేరటానికి సురేఖ కార్యకర్తలను ఆకట్టుకోవటం ఒక కారణమైతే, తెలంగాణా ఉద్యమం ఈ ప్రాంతంలో బలంగా నాతుకుపోవడం మరో కారణంగా వారు తేలుస్తున్నారు. ఈ తెలంగాణా పేరుచెప్పి టి.ఆర్.ఎస్. ఒక పక్క మరోపక్క కార్యకర్తలను ఆకర్షిస్తున్నాయి. ఇక ఉన్నది పెరగకపోయినా తన క్యాడర్ ను అలానే కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ శ్రమపడింది. ఈ శ్రమ ఫలితంగా ఆ పార్టీ కొత్తగా పెరగకపోయినా గతంలో ఉన్న ఓట్లను తిరిగి సంపాదించుకోగలమనే ధీమాతో ఉంది.

 

 

మొత్తమ్మీద వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, టిడిపి, టి.ఆర్.ఎస్., బిజెపి ప్రధానంగా ఈ నియోజకవర్గంలోని ఓట్లను చీలుస్తాయి. ఆ నాలుగు పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీలో ఉన్నందున గెలిచే అభ్యర్థికి వచ్చేది తక్కువ మెజారిటీనే అన్నది అర్థమవుతోంది. కానీ, ఆ నాలుగు పార్టీలు పోటీలో ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తలను తిప్పుకోవటమే ఇక్కడ ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు సిఎం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో ఈ ఒక్క స్థానాన్ని వదులుకుని మిగిలిన సీమాంధ్రపై ఎక్కువ ద్రుశితి పెట్టాలని నాయకులు నిర్ణయించుకున్నారనీ తెలుస్తోంది. ఏమైనా ఇటీవల కాలంలో సిఎం సీమాంధ్ర వైపు మొగ్గినందున అక్కడేమి ప్రసంగిస్తారన్న అంశంపై ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. అందుకనే సిఎం తిరిగి బయలుదేరేటప్పుడు వరంగల్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ బిజెపి, టి.ఆర్.ఎస్., జగన్ లపై నిప్పులు చెరిగారు.

By
en-us Political News

  
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.