ఆగస్టులోనే మంత్రివర్గ విస్తరణ? సంచలనం చేయబోతున్న కేసీఆర్..

Publish Date:Aug 17, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ/ విస్తరణ కసరత్తు ప్రారంభించారా? త్వరలోనే ఆ ఒక్కటీ కూడా కానిచ్చి, దళిత అజెండాను సంపూర్ణం చేస్తారా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి చేయక పోగా, ఉప ముఖ్యమంత్రి పదవినీ ఊడపీకారని  విపక్షాలు చేస్తున్న విమర్శకు జవాబుగా.. మళ్ళీ మరోమారు మరో దళితనేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఒకప్పుడు ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలు అసలు పట్టించుకునే వారు కాదు. విపక్ష పార్టీలకు పనీపాట లేదని, అవగాహనా అసలే లేదని అందుకే పని కట్టుకుని విమర్శలు చేస్తుంటారని ముఖ్యమంత్రి పలు సంధర్భాలలో పేర్కొన్నారు. ఒక విధంగా ఆయన  విపక్షాల విమర్శలను తేలిగ్గా తీసేపారేయడం అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాదు, జాతీయ పార్టీల జాతీయ నాయకుల నుంచి కీలక పదవులలో ఉన్న ప్రాతీయ పార్టీల నాయకుల వరకు ఎవరికీ కూడా ఏమీ తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చితాభిప్రాయం. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఏది మంచో ఏది చెడో తనకు తప్ప మరొకరికి తెలుసంటే అసలే  ఒప్పుకోరు. ఆన్ని విషయాలను, శాస్త్రీయంగా అధ్యనం చేసి సమస్యలను, పరిష్కారాలను ప్యాక్ చేసి పెట్టుకున్నానని, తనకు మాత్రమే ఆ వివరాలు తెలుసుని, ఆయన  నమ్ముతారు ఇతరులు నమ్మితీరాలంటారు. అదే విషయాన్ని అయన అనేక సందర్భాలలో బహిరంగంగానే బయట పెట్టారు. నిజానికి ఇప్పటికి కూడా అయన అదే అభిప్రాయంతో ఉన్నారు. 

అయితే అనవసరంగా, అనాలోచితంగా తలకు చుట్టుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కంప నుంచి బయట పడేందుకు కావచ్చు, ఇటీవల కాలంలో ఆయన తమ ఆలోచనా పంథాను కొద్దిగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. విపక్షాలను ఉపేక్షిస్తే, అసలుకే మోసం జరిగే ప్రమాదం పొంచి ఉందని గ్రహించారో ఏమో కానీ, విపక్షాల విమర్శలకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం  ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రారన్న విపక్షాల విమర్శకు జవాబుగా బయటకు వచ్చారు, ఎదో ఒక వంకన ఉరూరా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే మరిచి పోతారు, మళ్ళీ మళ్ళీ అవే హామీలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారని, ఎన్నికల తర్వాత అసలు ఆవైపు కన్నెత్తి అయినా చూడనే విమర్శకు జవాబుగా, నాగార్జున సాగర్ వెళ్లి వచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలనే మళ్ళీ పునరుద్ఘాటించి వచ్చారు. 

ముఖ్యమంత్రి కార్యాలయంలో దళితులకు స్థానం లేదా?  ముఖ్యమంత్రి కార్యాలయంలోకి దళిత అధికారాలకు ప్రవేశం లేదా?  అన్న విమర్శలకు సమాధానంగా ఆగష్టు 16 న దళిత బంధు  ప్రారంభ వేదిక నుంచే, ఐఏఎస్ అధికారి  రాహుల్ బోజ్జాను, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకుంటున్నట్లు ప్రకతించారు. నిజానికి, అధికారుల నియామకాలు, బదిలీలు బహిరంగ వేదికల నుంచి ప్రకటించవలసిన ఆవసరం లేదు, అయినా ముఖ్యమంతి కేసేఆర్, రాహుల్ బొజ్జా నియామకం విషయాన్ని బహిరంగ వేదిక నుంచి ప్రకటించడమే కాకుండా, రాహుల్ తండ్రి బొజ్జా తారకాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన గుణగణాలను ప్రశంసించారు. అంటే, రాహుల్ బొజ్జా నియామకం రాజకీయ అప్పాయింట్మెంట్ అని చెప్పకనే చెప్పారు;. ఆ విధంగా ఏడేళ్ళుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో దళిత అధికారులు ఎందుకు  లేరన్న విమర్శకు సమాధానం ఇచ్చారు. 

ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా విపక్షాల విమర్శలకు  మాటలతో కుండా చేతలతో సమాధానం ఇస్తూ వస్తున్న కేసీఆర్, దళిత ఉప ముఖ్యమంత్రి ఏరన్న ప్రశ్నకు, విస్తరణ ద్వారా జవాబు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అయితే, మంత్రివర్గ విస్తరణ/ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు, ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్’ కు ప్రమోషన్ ఇచ్చి సింపుల్ ‘గా  కానిస్తారా లేక పనిలో పనిగా కొత్త వారికి అవకాశం కల్పించడంతో తోపాటుగా  ప్రస్తుత మంత్రుఅలలో కొదరికి ఉద్వాసన పలకుతారా అనే విషయంలోనూ స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. అలాగే, మత్రివర్గంలో  ఉద్యమ ద్రోహులే ఎక్కువగా ఉన్నారనే విపక్షాలు, ఉద్యమ సంఘాలు చేస్తున్న మరో ప్రధాన విమర్శకు కూడా మౌనంగాగానే సమాధానం ఇస్తారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం తప్పక ఉంటుందని, దళిత ముఖ్యమంత్రి పదవి పునరుద్ధరణ కూడా తప్పక జరుగుతుందని,అది కూడా ఆగష్టు 30 లోగానే ఉంటుందని సన్నిహిత వర్గాల పక్కా సమాచారం.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.