త‌మిళిసైకి కేసీఆర్ షాక్‌! స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి చెక్‌! ముందే చెప్పిన తెలుగువ‌న్‌

Publish Date:Feb 28, 2022

Advertisement

'తెలుగువ‌న్' చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ఉభ‌య స‌భలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. రాజ్యాంగ సంక్షోభం వ‌చ్చినా స‌రే.. త‌గ్గేదేలే అంటూ కేసీఆర్‌.. త‌మిళిసైతో తాడోపేడో తేల్చుకునేందుకే సై అన్నారు. స‌రికొత్త సమ‌రానికి శ్రీకారం చుట్టారు. 

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించి.. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. మార్చి 7, సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెష‌న్‌ ప్రారంభించనున్నారు. అంత‌కుముందు రోజు మార్చి 6, ఆదివారం రోజున తెలంగాణ కేబినెట్ స‌మావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెల‌ప‌నుంది. మార్చి 7న అసెంబ్లీలో ఆర్థిక‌మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే, ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ చేసే ప్ర‌సంగం లేకుండా చేయ‌డం చర్చనీయాంశంతో పాటు తీవ్ర వివాదాస్ప‌ద‌మూ అవుతోంది. 

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై కేసీఆర్ స‌ర్కారు యుద్ధానికి దిగుతున్న‌ట్టుంది. ఉభ‌య స‌భ‌లు ప్రారంభించాలంటే ఆ మేర‌కు రాజ్ భ‌వ‌న్ నుంచి నోటిఫికేష‌న్ రావాలి. కానీ, ఈసారి ఆ నోటిఫికేష‌న్‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ రిలీజ్ చేయ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. ఇక‌, ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసే.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా స‌మావేశాల‌ను ప్రారంభించ‌డం రాజ్యాంగ సంక్షోభానికీ దారితీసే అవ‌కాశం లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

రాజ్ భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌. కేసీఆర్‌కు త‌మిళిసైకు మ‌ధ్య కోల్డ్‌వార్‌. ఈ రెండు రాజ్యాంగ హోదాల మ‌ధ్య స‌త్సంబంధాలు బాగా దెబ్బ‌తిన్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ కీల‌క నేత త‌మిళిసైను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌డం సీఎం కేసీఆర్‌కు అస‌లేమాత్రం ఇష్టం లేదు. బ‌హుషా అందుకే కాబోలు.. ఆమె రాజ్‌భ‌వ‌న్‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ కేసీఆర్ వైఖ‌రి పూర్తిగా మారిపోయింది. గ‌తంలో న‌ర‌సింహ‌న్‌కు ఎంత‌గా ప్రాధాన్యం ఇచ్చేవారో.. త‌మిళిసైను అంత‌గా ప‌క్క‌న‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. 

సాధ్య‌మైనంత వ‌ర‌కూ.. త‌మిళిసై స్థాయిని త‌గ్గించాల‌ని ఈసారి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. రాజ్ భ‌వ‌న్ నుంచి నోటిఫికేష‌న్‌, ఉభ‌య స‌భ‌ల స‌మావేశం, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం, మేడ‌మ్ అనుమ‌తి.. త‌దిత‌ర నిబంధ‌న‌లను తూచ్ అనేశారు సీఎం కేసీఆర్‌. 

అయితే, గ‌వ‌ర్న‌ర్‌ను కాద‌ని.. రాజ్యాంగ సంప్ర‌దాయాల విష‌యాలను మార్చే ప్ర‌య‌త్నం చేస్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. కొన్ని ప‌ద‌వుల‌ను, కొన్ని సంప్ర‌దాయాల‌ను గౌర‌వించాల్సిందేన‌నేది కొంద‌రంటున్నారు. కాదూ కూడ‌ద‌ని.. సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకెళ్తే.. బ‌డ్జెట్ సెష‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ కీల‌క పాత్ర‌ను త‌గ్గించాల‌నో, అస‌లు లేకుండానో చేయాల‌ని చూస్తే.. అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో రాజ్యాంగ సంక్షోభం వ‌చ్చే ప్ర‌మాద‌మూ లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఇటీవ‌ల కాలంలో మ‌రీ డ‌మ్మీ చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. గ‌తంలో న‌ర‌సింహ‌న్ టైమ్‌లో నెల‌కోసారి వెళ్లిన‌ట్టు రాజ్‌భ‌వ‌న్‌ వెళ్లేవారు ముఖ్య‌మంత్రి. త‌మిళిసై వ‌చ్చాక రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి పాల‌నా విష‌యాలు, ప్ర‌భుత్వ అంశాలు.. గ‌వ‌ర్న‌ర్‌కు బ్రీఫింగ్ చేసే విష‌యాన్ని పూర్తిగా త‌గ్గించేశారు. ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేకుండా.. త‌మిళిసై ప‌లు అంశాల్లో స్వ‌చ్చందంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం కేసీఆర్‌కు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే, త‌న‌కు అనుకూలంగా లేనంత మాత్రాన‌.. మ‌రీ ఇంత‌లా ప‌క్క‌న పెట్టేయ‌డం మంచి విష‌యం కాదంటున్నారు. కొవిడ్ సాకు చెప్పి.. రిప‌బ్లిక్ డే నాడు రాజ్ భ‌వ‌న్‌లో ఎట్ హోం కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టారు కేసీఆర్‌. ఏదైనా ప్రొగ్రామ్‌కు గ‌వ‌ర్న‌ర్ హాజ‌రైతే.. అక్క‌డ‌కు కేసీఆర్ వెళ్ల‌ట్లేదు. ఎలాంటి వేదిక‌నైనా గ‌వ‌ర్న‌ర్‌తో క‌లిసి పంచుకునేందుకు ముఖ్య‌మంత్రి ఇష్ట‌ప‌డ‌టం లేదు. 

ఇక, ఇటీవ‌ల మేడారం జాత‌ర‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ద‌ర్శించారు. మంత్రులెవరూ మేడమ్ ను రిసీవ్ చేసుకోలేదు. ప్రోటోకాల్ ప్ర‌కారం జిల్లా క‌లెక్ట‌ర్ వెళ్లి మేడ‌మ్‌కు స్వాగ‌తం ప‌ల‌కాల్సి ఉంది. కానీ, ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌చ్చిన ఆదేశాలతో క‌లెక్ట‌ర్ కాకుండా జాయింట్ క‌లెక్ట‌ర్‌తో గ‌వ‌ర్న‌ర్‌కు వెల్‌క‌మ్ చెప్పించి ఆ ప‌ద‌వినే అవ‌మానించార‌ని అంటున్నారు. ఇక‌, మేడారం టూర్‌కు హెలికాప్ట‌ర్ అరేంజ్ చేయమ‌ని రాజ్‌భ‌వ‌న్ నుంచి రిక్వెస్ట్ వ‌చ్చినా.. లైట్ తీసుకుంద‌ట ప్ర‌భుత్వం. ఇలా అడుగ‌డుగునా త‌మిళిసైతో వ్య‌వ‌హారం తెగేదాకా లాగుతున్నారు కేసీఆర్‌. తాజాగా.. స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా చేసి.. సంక్షోభం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలుగువ‌న్‌.. నాలుగు రోజులు ముందే అనుమానించింది. ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. తెలుగువ‌న్ క‌థ‌నంపై ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల్లో చ‌ర్చ కూడా జ‌రిగింది. అయినా, స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై క‌త్తి వేలాడ దీశారు.

ఇక‌, ముఖ్య‌మంత్రి తీరుపై ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని అంటున్నారు. ఇప్పుడు బ‌డ్జెట్ సెష‌న్‌లోనూ గ‌వ‌ర్న‌ర్ ఔనిత్యాన్ని త‌గ్గించాల‌ని చూస్తే.. ఢిల్లీ నుంచి సీరియ‌స్ యాక్ష‌న్ తప్ప‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. రాజ్యాంగ సంక్షోభం త‌లెత్తితే.. అది కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌త‌నానికీ దారి తీయొచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, గ‌వ‌ర్న‌ర్‌తో తెగేదాకా లాగుతున్న కేసీఆర్‌.. ఇక తెంచేందుకే సిద్ధ‌మ‌య్యారా? అందుకే, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా చేస్తున్నారా? మ‌రి, ఈ దూకుడు ఎక్క‌డికి దారి తీస్తుందో చూడాలి..?

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.