కేరళ సీఎంతో కేసీఆర్ మంత్రాంగం.. థర్డ్ ఫ్రంట్ కోసమేనా?
Publish Date:Jan 8, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్లడం ఖాయమా? బీజేపీ టార్గెట్ గా ఆయన కార్యాచరణ ఉండబోతోందా? ఈ చర్చ కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాజాగా అందుకు బలాన్నిచ్చేలా రాజకీయ అడుగులు కనిపిస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. విజయన్ తో పాటు సీపీఎం పార్టీ జాతీయ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ను లంచ్‌కు పిలిచి మరీ చర్చలు జరిపారు కేసీఆర్. కేరళ ముఖ్యమంత్రితో పాటుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూర్ సభ్యుడు ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. కేంద్రం నిర్ణయాలు, రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై చర్చించినట్లు తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమావేశంలో పాల్గొనడంపై చర్చ జరిగింది. త్వరలో సీపీఎం కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో ప్రదర్శనలు. ఈ భేటీ తర్వాత సీపీఐ రాష్ట్ర నాయకులతో కేసీఆర్ సమావేశానికి సంబంధించిన సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్..జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి.. మధ్యలో ఆగిపోయాయి. అయితే, ఇప్పుడు మాత్రం పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఇదే సరైన సమయంగా కేసీఆర్ కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఆలయ సందర్శన కోసం వెళ్లిన సమయంలో ఆ రాష్ట్ర స్టాలిన్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు కేసీఆర్. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారని చెప్పారు. వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఆ సాయాన్ని కేసీఆర్ ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలను తన ఢిల్లీ టార్గెట్‌కు అనుకూలంగా మలచుకునేలా కేసీఆర్ వ్యూహరచనను చూపిస్తుంది. సీపీఎం నేతలతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఐ నేత డి.రాజాతో భేటీ అయ్యారు. త్వరలో ఢిల్లీ కేంద్రం బీజేపీ - కాంగ్రెసేతర పార్టీల నేతలతో సీఎం సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వామపక్ష నేతలతో కేసీఆర్ చర్చల అంశం రాజకీయాల్లోనూ చర్చగా మారింది.
http://www.teluguone.com/news/content/cm-kcr-meet-kerala-cm-vijayan-39-129897.html





