రాష్ట్రపతి ఎన్నికల్లో ఎదురీత తప్పదా?

Publish Date:Jan 8, 2022

Advertisement

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరూ ఉహించలేరు. అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్ని సందర్భాలలో అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఉహకందని పరిణామాలు, ఇటును అటూ అటును ఇటూ చేసేస్తాయి. రాష్ట్రపతి రామనాథ్ కొవింద్ ఎన్నిక సమయంలో బీజేపీకి భయం లేదు. పూర్తి భరోసాతో బరిలో దిగింది. అదే విధంగా, అంతవరకు దేశానికీ అంతగా పరిచయం లేని రామనాథ్ కొవింద్ దేశ ప్రధమ పౌరుడుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే, ఇప్పుడు, ఈ సంవత్సరం (2022) జూలైలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది.ఈ నేపధ్యంలో కొత్త అధ్యక్షుని ఎన్నిక జరగ వలసి వుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి  బీజేపీలో అప్పుడున్న భరోసా ఇప్పుడు ఉందా, అంటే లేదు. నిజానికి బీజేపీ భయపడుతోందని రాజకీయ విశ్లేషకులే కాదు, బీజేపీ నాయకులూ కూడా అంగీకరిస్తున్నారు.  

నిజానికి, రాష్ట్రపతి ఎన్నిక ఒక్కటే కాదు, అంతకంటే ముందే ఖాళీ అవుతున్న 75 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలు కూడా కమల దళాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం 26 సీట్లు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. తిరిగి ఈ 26 స్థానాలను రాబట్టుకోవడంతో పాటుగా అదనంగా అన్నో ఇన్నో స్థానాలు తమ ఖాతాలో కలుపుకోవడం ఎలా, అనేది ఇప్పుడు బీజేపీ నాయకుల ముందున్న మేజర్ సవాల్’గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పెద్దల సభలో స్థానం దక్కాలంటే ఆయా రాష్ట్రాల శాసన సభలో ఎమ్మెల్యేల సఖ్యాబలమే కీలకం అవుతుంది. ఈవిషయమలో బీజేపీ జాతీయ పార్టీల కంటే  ప్రాతీయ పార్టీల నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటోందని అంటున్నారు. 

దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో  తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు చాలా స్పష్టంగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాయి. బీజేపీ ప్రాబల్యాన్ని పడగొట్టేందుకు ఏ చిన్నఅవకాశాన్ని, ఈ పార్టీలు వదులు కోవు. మరో వంక ఇంతవరకు ఎంతోకొంత మేర బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కూడా మెల్లమెల్లగా దూమవుతున్నాయి. మరో వంక వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ముఖ్యంగా  మొత్తం 75 లో 11 రాజ్యసభ స్థానాలు ఖాళీ వుతున్న యూపీలో ప్రాంతీయ పార్టీలు గట్టి పట్టు మీదున్నాయి. రేపటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలుపుకున్నా, ప్రస్తుతమున్న 11 రాజ్యసభ స్థానాలను నిలుపుకోవడం అయ్యేపని కాదని అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 300లకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ. ఈ సారి ఆ స్థాయి విజయం సాధ్యం కాదు. సో .. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిన మేరకు రాష్ట్రం నుంచి పెద్దల సభకు వెళ్ళే కాషాయ సభ్యుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఒక్క ఉత్తర ప్రదేశ్’లోనే కాదు, పంజాబ్ (7), మహారాష్ట్ర (6), తమిళ నాడు (6) లలో కూడా బీజేపీ గెలుపు అవకాశాలు లేవు. ఈ రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. సో.. ఈ 19 రాజ్యసభ సీట్లలో ఒక్కటి  కూడా బీజేపీకి దక్కదు. అలాగే ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా అధికార  వైసీపీ గెలుచుకుంటుంది. 

సో  లోక్ సభలో బీజేపీ కి పూర్తి మెజారిటీ ఉన్నా, రాజ్య సభలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రేపు రాదు. కాబట్టి, బీజేపీ ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. అందుకే, అటు ఏపీలో ఇటు తెలంగాణలో అలాగే, అటూ ఇటూ కాకుండా ఉన్న ఇతర రాష్ట్రాలలో బీజేపీ, పెద్దగా దూకుడు చూపలేక పోతోందని పరిశీలకులు అంటున్నారు. మరోవంక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, పెద్దల సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరు గమనిస్తే, తెరాస, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీలు  రాజ్య సభలోనే కాదు, రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీకి మద్దతు ఇవ్వకపోవచ్చని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, అందుకు మరో నాలుగైదు నెలల సమయం వుంది ఈలోగా ఏమైనా జరగవచ్చని... ఈరోజుకు అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురీత తప్పదనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.