తెలంగాణలో లాక్ డౌన్! సీఎం కేసీఆర్ క్లారిటీ...

Publish Date:May 6, 2021

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సిజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని ద్రుష్టికి తెచ్చారు.  మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. 

సీఎం కెసిఆర్ విజ్జప్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సిఎం కు హామీ ఇచ్చారు. ఆక్సిజన్ ను కర్నాటక తమిళనాడులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

కరోనా పరిస్థితుల పై గురువారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నిసిఎం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది ఇంకా ఎంతకావలి? వాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం ? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను ఆక్సిజన్ బెడ్ల లభ్యత వంటి విషయాలమీద పూర్తిస్థాయిలో చర్చించారు.  రెమిడిసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన..  సిఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో  ఇప్పటివరకు 9500 ఆక్సిజన్ బెడ్లు వున్నాయని వాటిని హైద్రాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరాకోసం వొక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యునిటీ హాస్పటల్స్ ఏరియా ఆస్పటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం)  కోలుకున్నారని అధికారులు సిఎం కు వివరించారు.  రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి  డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి  పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్న వారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

 మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. ఆక్సిజన్  సరఫరా గురించి సమీక్షించిన సిఎం రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం సూచించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు.

కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కేసీఆర్  కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ....కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

By
en-us Political News

  
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.