కేసీఆర్ శెభాష్ అంటుంటే... హైకోర్టు ఏకిపారేసింది... జనం మాటే వినిపించింది
Publish Date:Jun 2, 2017
Advertisement
తెలుగు రాష్ట్రాల పోలీసులను ఉమ్మడి హైకోర్టు ఏకిపారేసింది. భువనగిరి స్వాతి-నరేష్ లవ్ అండ్ మర్డర్ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం.... పోలీసుల తీరుపై విరుచుకుపడింది. పోలీసులు ఎందుకు పారదర్శకంగా ఉండటం లేదని ప్రశ్నించింది.... పోలీసులు తమ ఇమేజ్ కాపాడుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మెజారిటీ ప్రజలు.... పోలీసులు తీరుపై అసంతృప్తితో ఉన్నారన్న డివిజన్ బెంచ్.... ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల వ్యవహారశైలిపై మెజారిటీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు.... తమ ఇమేజ్‌ను కాపాడుకునేలా పోలీసులు వ్యవహరించాలంటూ ఘాటు వ్యాఖ‌్యలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయస్థానం..... పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. నరేష్-స్వాతి కేసులో పాయింట్ టు పాయింట్ ప్రశ్నించిన డివిజన్ బెంచ్... పోలీసులను ఏకి పారేసింది. ఎందుకు బాధితుల పక్షాన నిలబడటం లేదంటూ నిలదీసింది. ప్రజలు ఆరోపిస్తున్నట్లుగా పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. నరేష్-స్వాతి కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై మెజారిటీ ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని... పనితీరు, వ్యవహారశైలి మార్చుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇఛ్చింది. భువనగిరి స్వాతి-నరేష్ లవ్ అండ్ మర్డర్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు పోలీస్ శాఖలో సంచలనంగా మారాయి. ఒకవైపు పోలీసుల పనితీరుపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ‌్యమంత్రి కేసీఆర్ శెభాష్ అంటుంటే.... హైకోర్టు వ్యాఖ‌్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ...పోలీస్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమనే మాట వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-kcr-45-75283.html





