ఆయన మారరు.. మార్చ వలసిందే...

Publish Date:Dec 20, 2021

Advertisement

ఇంటికంటే గుడి పదిలం అంటారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ప్రగతి భవన్ కంటే ఫామ్‌హౌస్‌ మేలని అంటారో లేదో కానీ, ఆయన ఫామ్‌హౌస్‌ (ఎర్ర‌వ‌ల్లి  వ్య‌వ‌సాయ క్షేత్రం)లో ఉండేదుకు ఎక్కువ ఇష్టపడతారని, ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.  అంతే  కాదు, ముఖ్యమంత్రి కూడా ఒకటి  రెండు సందర్భాలలో వ్య‌వ‌సాయ క్షేత్రం ప్రస్తావన చేశారు. సరే, అది ఆయన ఎలా సంపాదించారు, ఎలా విస్తరించారు, కోటి రూపాయల ఆదాయం ఎలా వచ్చింది అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి పక్కన పెడితే, ముఖ్యమంత్రి  గ‌తేడాది డిసెంబ‌ర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబ‌ర్ 12 వ‌ర‌కూ, అంటే ఒక సంవత్సర కాలంలో 142 రోజుల పాటు ఎర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే గ‌డిపారు.

సహజంగా ముఖ్యమంత్రి , మంత్రులు, సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తారు. కాదంటే, అత్యవసర విధులను అధికార నివాసం నుంచి నిర్వహిస్తారు. ప్రజలను, అధికారాలను ప్రత్యక్షంగా కలుస్తారు. సమస్యలు తెలుసు కుంటారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రతి రోజు కొంత సమయం ప్రజలకు కేటాయించి, ప్రజా దర్బార్’లో ప్రజల సమస్యలు తెలుసుకుని, అత్యవసరం అనుకున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. కానీ, కేసీఆర్ స్టైలే వేరు… ఇప్పుడే కాదు సచివాలయం కూల్చక ముందు కూడా అయన పెద్దగా,, సచివాలయం వైపు  కన్నెత్తి చూడలేదు. ప్రగతి భవన తయారైన తర్వాత అసలు సచివాలయం ఒకటుందనే మరిచి పోయారు. ఆ తర్వాత సచివాలంలో ముఖ్యమంత్రి కాలు పెట్టిన సందర్భం బహుశా లేదని చెప్ప వచ్చును. అంతేకాదు, నిన్నమొన్నటి దాకా, ముఖ్యమంత్రి దర్శనం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులకు కూడా దొరికేది దు. ఇదేమి రహస్యం కాదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయక పోవడం ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. అయితే, హుజూరాబాద్ ఎపిసోడ్ తర్వాత ఈమధ్య కాలంలో కొద్దిగా మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ, కడుపులో లేనిది కక్కుకుంటే వస్తుందా అన్నట్లు, ఆయన మొక్కుబడిగా మాత్రమే బయటకు వస్తున్నారు. 

నిజానికి ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్ విషయంలో, చాలా చాలా విమర్శలు వచ్చాయి. అయినా, అయన ఎప్పుడూ విమర్శలను అంతగా పట్టించుకోలేదు. సచివాలయానికి చుట్టపు చూపుగా అయినా రాని  ముఖ్యమంత్రి అని విపక్షాలు ఎద్దేవ చేసినా పట్టించుకోలేదు. అధికారుల అభ్యంతరాలను అయితే అసలే పట్టించుకోలేదు. సహజంగా ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, సంబంధిత అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులతో క‌లిసి చర్చించి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ, కేసీఆర్ అందుకు విరుద్ధం.

అందుకే, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏం తెలుసుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌’కే, పరిమితమెయిన్ ముఖ్యమంత్రి   ఇక పాల‌న ఎలా చేస్తారంటూ,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో కదిగి పారేశారు. ఇతర విప‌క్షాలు ఆయ‌న‌పై మాట‌ల దాడి కొన‌సాగిస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్‌.. నేనేను నేనే, అన్నట్లుగా  త‌న పంథాను మార్చుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో నెలలో సగం రోజులకంటే ఎక్కువ ఫామ్‌హౌస్‌’లోనే ఉంటున్నారు. గ‌తేడాది జూన్‌లో 18 రోజులు, జ‌న‌వ‌రిలో 17 రోజులు ఇలా ఫామ్‌హౌస్‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. ఇలా ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌’కే పరిమితం అయితే, పరిపాలన పరంగానే, కాకుండా ప్రజలకు కూడా  ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అయినా ఆయన దారి ఆయనదే., ఆయనంతే ఆయనంతట ఆయన మారరు .. జనం మార్చ వలసిందే.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.