హిట్ల‌ర్, ఇందిర బాట‌లో జ‌గ‌న్‌..! నియంతల‌కు మించి ఉక్కుపాదం!

Publish Date:Aug 28, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’లో పత్రికా స్వేచ్చ ఉన్నట్లే ఉంటుంది కానీ, ఉండదు. అదొక ఎండమావి.  ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికా స్వేచ్చ అన్న మాట వినడం కూడా ఇష్టం ఉండదో ఏమో, ఆయన ఏకంగా  మీడియాపై యుద్దమే ప్రకటించారు. యుద్దానికి సిద్దం కండని అధికారాలకు పిలుపు నిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్కటై పత్రికల మీద యుద్ధం చేయాలని కల్లెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. “ మీరు యుద్దం చేయవలసింది రాజకీయ పార్టీలు , నాయకు మీద కాదు, పత్రికల మీద, కత్తులు తీయండి” అంటూ పిలుపు నిచ్చారు. ముఖ్యంగా జిల్లా కల్లెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా మీడియాపై యుద్దానికి సిద్ధంకావాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పిలుపు నిచ్చారు. 

ఆలస్యంగా వెలుగు చూసిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్’లో ఆయన ప్రసంగం వీడియో వింటే, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు పత్రికలు, మీడియా అది కూడా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కారణమనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏ విధంగా అయితే, అయిన దానికి కాని దానికి, ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశారో, ఆయన అడుగు జాడల్లో, అదే అరాచక మార్గంలో నడుస్తున్న అయన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా అవే పలుకులు పలుకుతున్నారు. అయితే, వైఎస్ ఎప్పుడు ఇలా బొమికలు మెడలో వేసుకోలేదు. మీడియా మీద యుద్దానికి అధికారులను ఉసిగొల్పలేదు. అయితే, జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే, ఆయన తండ్రిని మించి పోయారు అనిపిస్తుంది. నియంతలకే నియంత స్థాయికి ఎదిగారా, అన్న అనుమానం కూడా కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ఆయన చేసిన ప్రసంగంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్ననేరాలు ఘోరాలు, ముఖ్యంగా  మహిళలు, కాలేజీ అమ్మాయిలు, వృద్దులు ఒకరని కాదు, పసి కందుల మొదలు పండు ముసలి వారి వరకు అందరిపైనా సాగుతున్న లైంగిక నేరాలు, అరాచకాలు, అకృత్యాల గురింఛి మాట్లాడారు. అయితే అవన్నీ, ‘దురదృష్టకర’ సంఘటనలు అన్న చిన్నా మాటతో తేల్చేసారు. ఒక విధంగా ఎలాంటి ఘటనల పట్ల ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎలాంటి చింతా లేదన్నట్లుగా మాట్లాడారు. బహుశా ముఖ్యమంత్రి దృష్టిలో ఇవేవీ నేరాలు కాదో ఏమో, అందుకే ఆయన నేరాలాను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం. అమ్మాయిలతో నడి రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించడం ఈవ్ టీజింగ్, నేరం కాదనే చక్కని సందేశాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. మరో వంక నేరస్తులను వదిలేసి, జరుగుతున్న వాస్తవాలను జనంలోకి తీసుకుపోతున్న మీడియాపై మండిపడుతున్నారు. 

కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి, “రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంతగా అప్రమత్తంగా ఉన్నా, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, అధికార, పోలీసు యంత్రాంగం మంచిగా స్పందిస్తోంది, అయినా స్వార్ధపర శక్తులు వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయి. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడపిల్లల కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ఈవ్ టీజింగ్ లాంటి కేసులో, పోలీసు కానిస్టేబుల్’ను సస్పెండ్ చేసినా, సోషల్ మీడియా, పత్రికలు, టీవీలలో ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పడేసే విధంగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి, మనం ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో జరుగతున్న సంఘటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవల్సినవసరం వుంది” అంటూ చక్కటి సందేశం ఇచ్చారు. అయినా, అందులో అపశ్రుతులు, అసత్యాలు ఉన్నా, అధికారులను అప్రమత్తం చేయడం వరకు కొంత బాగుందని అనుకావచ్చును. ఆ తర్వాత అయన నోటి నుంచి జాలువారిన అక్షర ముత్యాలు  నియంత నిజరూపాన్ని చూపించింది. హిట్లరు నుంచి ఇందిరా గాంధీ వరకు నియంతలు ఎవరికీ  పత్రికా స్వేచ్చ అంటే అసలు రుచించదు. ఇప్పడు ఆ జాబితాలో జగన్ రెడ్డి కూడా చేరారు.
 
పత్రికా స్వేచ్చ పట్ల  ఆయనకు అంతటి వ్యతిరేకత ఎందుకో ఏమో కానీ, ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు మీడియా మీద యుద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. “మీరు యుద్ధం చేయవలసింది, రాజకీయ పార్టీలు, నాయకుల మీద కాదు, తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేందుకు అన్నిటికీ తెగించిన మీడియాలోని  ఒక వర్గం మీద, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 మీద యుద్దం చేయండి” అని పిలుపు  నిచ్చారు. 

అయితే, జగన్ రెడ్డి గమనించవలసిన విషయం ఏమంటే, పత్రికా స్వేచ్ఛను చంపే ప్రయత్నం చేసిన, మహా నాయకులు, మహా నియంతలే మట్టి కరిచి పోయారు. పత్రికా స్వేచ్ఛను హతమార్చడం ఎవరికీ అయ్యే పనికాదని చరిత్ర చెపుతోంది. అందుకు జగన్ రెడ్డి మినహాయింపు కాదు. నిజానికి, జగన్ రెడ్డి పాలనలో  వైట్ కాలర్ (ఆర్థిక)  నేరాలు మొదలు, మర్డర్లు, మాన భంగాల వరకు అన్నీ రకాల నేరాలు పెరిగి పోయాయి. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ మర్దరై పోయారు. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ, హంతకులు ఎవరో తేలడం లేదు. సో.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధం చేయవలసింది, మీడియా మీద కాదు, అధికార పార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్న నేరస్థుల మీద..అంటున్నారు సామాన్యులు. వింటున్నారా ..
 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.