చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా?
Publish Date:Sep 14, 2015
Advertisement
చంద్రబాబుకు పదవీ గండం ఉందని, 2017లో అంతర్గత కుమ్ములాటలు పెరిగి, అనూహ్య పరిస్థితుల్లో...టీడీపీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయని, అదే సమయంలో లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తే, సర్కార్ నిలబడుతుందని, లేదంటే ఇబ్బందికరమేనంటూ జ్యోతిష్కుడు రమణారావు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతమే అయినా, వాటిని తూచా తప్పకుండా ఆచరించేవాళ్లు మాత్రం ఈ జ్యోతిష్కుడి మాటలతో అయోమయంలో పడ్డారు. అలా జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన మాటలపై నమ్మకం కుదిరే...మూడేళ్లలో తానే సీఎం అవుతానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెబుతున్నాడని గుర్తుచేస్తున్నారు. పైగా చంద్రబాబు గ్రహస్థితి అంతగా బాగో లేదని, గ్రహాలు బలహీనంగా ఉన్నాయని చెప్పిన రమణారావు...జగన్ గ్రహస్థితి మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పైగా 2017లోనే జగన్ సీఎం అవుతారంటూ చెప్పడంతో, చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా అనే చర్చజరుగుతోంది.
అయితే జ్యోతిష్కులు చెప్పేవి అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోయినా, ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తుల గురించి వాళ్లు చెప్పే విషయాలు సంచలనంతోపాటు ఆసక్తిని రేకేత్తిస్తుంటాయ్. ఇప్పుడు చంద్రబాబు, జగన్ విషయంలో జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన విషయాలూ అంతే సంచలనం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు జిగిరీ దోస్త్ అయిన రమణారావు...2009లో టీడీపీ-టీఆర్ఎస్ కు పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారట. అంతేకాదు 2014లో కచ్చితంగా తెలంగాణ ఏర్పడటం ఖాయమని ముందే చెప్పానని ప్రచారం చేసుకునే రమణరావు... వైఎస్ విమాన ప్రమాదాన్ని కూడా ముందుగానే ఊహించి చెప్పారట.దాంతో పక్కా క్రిస్టియన్ అయిన జగన్ కు కూడా రమణారావుపై గురి కుదిరిందని, అందుకే బెంగళూర్ లోని జగన్ ఎస్టేట్స్ లో శాంతి హోమం చేయిస్తున్నారట. జగన్ కు కూడా వాళ్ల నాన్నలాగే ఆకాశ యానంలో ప్రమాదం ఉందని రమణారావు హెచ్చరించడంతోనే శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరి రమణారావు చెప్పినట్లుగా టీడీపీలో తిరుగుబాటు వస్తుందో? మూడేళ్లలో జగన్ సీఎం అవుతాడో తెలియదు కానీ...జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు మాత్రం...చంద్రబాబు శాంతి హోమం చేయించాలంటున్నారు. గ్రహాల అనుగ్రహం కోసం హోమం చేయడం తప్పుకాదంటున్న టీడీపీ నేతలు...టీ-సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ 2014కి ముందు ఇలాంటి హోమాలు ఎన్నో చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు కూలిపోవాలంటూ...రహస్య హోమాలు చేసిన వాళ్లూ ఉన్నారని, అలాంటి వాటికి విరుగుడుగా హోమం చేయడం మంచిదంటున్నారు. రమణారావు కూడా ఇదే విషయం చెప్పారని, కొన్ని పనులు చేస్తే రాజధాని నిర్మాణం త్వరగా పూర్తయి, చంద్రబాబు మంచిపేరు తెచ్చుకుంటారన్న మాటలను గుర్తుచేస్తున్నారు. మరి రమణారావు చెప్పిన జాతకం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మూరో మూడేళ్లు ఆగాల్సిందే.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-45-50054.html





