చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ : సీఎం చంద్రబాబు
Publish Date:Aug 7, 2025
Advertisement
చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేత కార్మికులు సీఎం అన్నారు. టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని.. నేతన్నాలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ చేనేత అని చంద్రబాబు తెలిపారు. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు. చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-203716.html





