బొత్స కిరణ్ లకు క్లాస్ పీకుడే?
Publish Date:Apr 4, 2012
Advertisement
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ సారథి బొత్స సత్యనారాయణ బుధవారం ఢిల్లీకి బయల్దేరారు. హై కమాండ్ వద్ద వారు 'క్లాస్ పీకించుకునేందుకే' ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకూ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ ముగ్గురితో అధిష్ఠానం పెద్దలు సమావేశంకానున్నారు. 18 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, పీసీసీ సారథుల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని అధిష్ఠానం ఆం దోళన చెందుతోంది. సత్వరం సయోధ్య కుదర్చకుంటే పార్టీ ఉనికికే ప్రమాదమని భావిస్తోంది.
కాగా, ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలందరితోనూ వారు కిరణ్, బొత్సల మధ్య దూరంగురించే వాకబు చేస్తున్నారు. "ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారా? రాష్ట్రంలో పరిస్థితులె లా ఉన్నాయి? ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీవే కదా! వాటిని కాపాడుకోకుంటే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటి?'' అంటూ ఆరా తీస్తున్నా రు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకూ నేతలనుంచి సానుకూల సమాధానాలు రావడంలేదు. పార్టీ, ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో... ప్రస్తుతానికి హెచ్చరికలతో సరిపెట్టి ఉప ఎన్నికల వరకు వేచి ఉండడమా? లేక ఇప్పుడే కాయకల్ప చికిత్స చేయడమా? అన్న మీమాంసలో పడినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సోనియాగాంధీ చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. 'తక్షణ కర్తవ్యం'పై చర్చకే డీఎస్‌ను పిలిపించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరగనున్న 18 శాసనసభా స్థానాల ఉప ఎన్నికలపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు బొత్స చెబుతున్నారు. ఇతర అంశాలేవీ ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం లేనేలేదని ఆయన కొట్టిపారేశారు. కానీ.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం 'క్లాస్ పీకేందుకే పిలుపు' అని గట్టిగా చెబుతున్నాయి. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో పార్టీ నేతలు 'అధిష్ఠానంతో జోడెద్దుల భేటీ'పైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఒకరు, పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో... 18 స్థానాలకు ఉప ఎన్నికల తర్వాత పార్టీ మిగులుతుందో లేదో తెలియడం లేదనే స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
http://www.teluguone.com/news/content/cm-24-13150.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





