సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ

Publish Date:Feb 21, 2012

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నారు. అప్పుడు ఖమ్మం మద్యం సిండికేట్ లీడర్ నున్న వెంకటరమణ రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడం... ఇప్పుడు నున్న రమణ కస్టడీ రిపోర్టులో 'సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చినందుకు మోపిదేవికి రూ.10 లక్షలు ఇచ్చాం' అని నున్న చెప్పినట్లుగా బయటపడటంపై మంత్రి మోపిదేవి రగిలిపోయారు. మంగళవారం సాయంత్రం హుటాహుటిన సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కిరణ్‌తో మోపిదేవి ముక్కుసూటిగా, కాసింత ఆగ్రహంగానే మాట్లాడారు. "ఆరోపణలు రావడం సాధారణమే అనుకున్నాను. వీటిపై ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని ఇంతకాలం భావించాను. కానీ... నన్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది'' అని నిష్కర్షగా చెప్పేశారు. "సహచర మంత్రిపై ఆరోపణలు వస్తే సీఎంగా మీరు మౌనంగా ఉంటే ఎలా? ఒకసారి ఆరోపణలు వచ్చినా మీరు ఖండించలేదు. రెండోసారీ ఏసీబీ నా పేరు లీక్ చేసింది. మిమ్మల్ని పది రోజుల కిందటే కలిశాను.

దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరాను. ఏసీబీ మీ పరిధిలోనే పని చేస్తుంది. అప్పుడే మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చే దే కాదు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటి దాకా ప్రతి రోజూ అసెంబ్లీలో ఇదే అంశంపై గందరగోళం జరుగుతోం ది'' అని మోపిదేవి సీఎంతో అన్నారు. మోపిదేవి ఆగ్రహంతో తన వాదన వినిపిస్తుండగా... సీఎం ఆయన భుజం తట్టి అనునయించారు. గురువారం ఈ అంశం శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లోగా వాస్తవాలు వెల్లడైతే బాగుంటుంది' అని రమణ చెప్పారు. ఆయన ఎంత సేపు మాట్లాడినా సీఎం 'కూల్ రమణా! ఏమీ కాదులే' అనడం తప్ప నిర్దిష్టంగా ఏ హామీ ఇవ్వలేదు. దీంతో మోపిదేవి కాస్త ఆగ్రహంగానే బయటకు వచ్చారు. కాగా, సభలో కిరణ్ తనకు అండగా నిలవకపోతే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి... కిరణ్‌కే లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత గాంధీ భవన్‌కు వెళ్లి పార్టీకీ గుడ్‌బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కిరణ్‌తో భేటీ అనంతరం మోపిదేవి పలువురు మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

By
en-us Political News

  
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.