జగన్ అవినీతిని ప్రశ్నించని కిరణ్..సేవలో తరిస్తున్నారా?

Publish Date:Feb 10, 2012

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సేవలో తరించి పోతున్నారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ బ్యాచ్, కిరణ్ బ్యాచ్ బిజీబిజీగా ఉన్నాయని, పరస్పరం ఈగ వాలకుండా చూసుకునే పనిలో తలమునకలయ్యాయని ఆయన అన్నారు. జగన్ అవినీతి వ్యవహారాలతో రాష్ట్రం రచ్చరచ్చగా మారినా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నోరు మెదపడం లేదన్నారు. ఒక్క చర్య తీసుకాలేదన్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ సేవలో కిరణ్ తరిస్తున్నట్లుగా కనిపిస్తోందని, కిరణ్, జగన్ కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని, వైఎస్ అవినీతి వారసత్వాన్ని కిరణ్ మోస్తుంటే రాజకీయ వారసత్వం కోసం జగన్ తహతహలాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంలోని, ప్రభుత్వ సంస్థల్లోని జగన్ వ్యతిరేకులను సిఎం కిరణ్ క్రమంగా సాగనంపుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్ స్కాంను బయటకు తెచ్చిన ఎపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం పదవి కాలం పూర్తి కాగానే పంపించి వేశారన్నారు. జగన్‌పై న్యాయపోరాటం చేస్తున్న శంకర్‌ రావును బర్తరఫ్‌ చేశారని, అలాగే కడపలో జగన్‌పై పోటీ చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖకు కోత పెట్టారని ఆరోపించారు.


జగన్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దగ్గర ఉన్న శాఖను తీసివేశారని ఆరోపించారు. సరస్వతి పవర్ సంస్థ పేరు మీద జగన్ అక్రమంగా తనకు తాను కేటాయించుకున్న సున్నపు రాయి గనులను రద్దు చేయాలన్న ప్రతిపాదన మూడు నెలలుగా సిఎం అనుమతి కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారాల్లో జగన్ బెదిరించారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి కొడుకు కొండా రెడ్డి ఫిర్యాదు చేసినా ఆ కేసులో జగన్‌ను చేర్చలేదని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్నప్పుడే ఎమ్మార్ స్కాం జరిగినా కేసు పెట్టలేదన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఓటు వేసినా వారి పదవులు పోకుండా కిరణ్ కాపాడుతున్నారని, ఎక్కడో స్పీకర్‌ను ఏదో ఒక మాట అన్నారని టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం సభ్యత్వం రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు జగన్ వర్గం ఎమ్మెల్యేల జోలికి వెళ్ళకుండా ఉండటం వెనక సీఎం జోక్యం లేదా అని ప్రశ్నించారు. కాగా, లిక్కర్ సిండికేట్ నుంచి ముడుపులు పుచ్చుకొన్నారంటూ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఎసిబి కోర్టులో నివేదిక దాఖలు చేసినా ఆయనను పదవి నుంచి సిఎం తప్పించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.