అది తిరిగి కిరణ్‌కే భస్మాసుర హస్తమైంది రోజా
Publish Date:Feb 9, 2012
Advertisement
హైదరాబాద్: సిఎల్పి అంటే కాంగ్రెస్ లిక్కర్ పార్టీగా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా గురువారం విమర్శించారు. మద్యాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడని బొత్సను విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లక్ష్యంగా ఎసిబి దాడులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయించగా, పలువురు మంత్రులు, శాసనసభ్యులకూ ప్రమేయం ఉండటంతో తిరిగి అది కిరణ్‌కే భస్మాసుర హస్తమైందని అన్నారు. మద్యం సిండికేట్లతో 20 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. మద్యం అదనపు ఉత్పిత్తికి ఏడాది కాలంలో 17 ఉత్తర్వులు వెలువరించడం సిగ్గు చేటని సిఎంపై ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే భయపడేది లేదని రోజా అన్నారు. భూపందేరంపై శాసనసభా సంఘం ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.
http://www.teluguone.com/news/content/clp-24-11762.html





