క్లాత్ మాస్క్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే?

Publish Date:Jan 8, 2022

Advertisement

కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఒమిక్రాన్ వైరస్ యూరప్ ను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆగమాగమవుతోంది. యూఎస్ఏలో రోజూ 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్ దేశాల్లో హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. మనదేశంలోనూ కొవిడ్ కేసులు కొన్ని రోజులుగా ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోజు లక్షన్నర వరకు కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో జనాల్లో ఆందోళన నెలకొంది. 

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం పాటించడమే పరిష్కారమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్ లేకుంటే గండానికి ఎదురు వెళ్లినట్టేనని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే  వైరస్ నుంచి రక్షణలో మాస్క్‌లు అత్యంత కీలకం అయినప్పటికీ.. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్‌ వలలో చిక్కుకుపోయాయి. తిరిగి ఉపయోగించడానికి వీలుాగ ఉండే కలర్ ఫుల్  క్లాత్‌ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి మాస్కులు ఉపయోగించడం సరికాదంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున సింగిల్‌ లేయర్‌ మాస్క్‌లను వాడకపోవడమే మేలని చెబుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

సింగిల్‌ లేయర్‌  ఉన్న క్లాత్ మాస్క్‌లు వైరస్‌లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ, చిన్న చిన్న ఏరోసెల్స్‌ను బ్లాక్‌ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది. ధ్రువీకరించిన ఎన్‌95 మాస్క్‌లు మాత్రం గాలిలోని 95శాతం అణువులను వడబోయగలవని వెల్లడించింది.  కానీ చాలా మంది ఫ్యాషన్‌ కోసమో లేదా తిరిగి వినియోగించే వీలు ఉంటుందనో క్లాత్‌ మాస్క్‌లను వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు వాటిని సర్జికల్‌ మాస్క్‌లతో కలిపి ధరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగానీ, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోన్న ఈ సమయంలో కేవలం క్లాత్‌ మాస్క్‌ లేదా సర్జికల్ మాస్క్‌ ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.  

మాస్క్‌ల వినియోగంపై అమెరికన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ గవర్నమెంటల్‌ ఇండస్ట్రియల్‌ హైజీనిస్ట్స్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పలు అధ్యయనాలు జరిపింది. వీటి ప్రకారం..  

-  ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ సోకుతుంది.  

- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 20 నిమిషాల్లో  వ్యాప్తిస్తుంది.   

- ఇక, ఇద్దరూ క్లాత్‌ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 

- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి చేరుతుంది.   

- అదే ఇద్దరిలో ఒకరు ఎన్‌95 మాస్క్‌ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్‌ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్‌ వ్యాపిస్తుంది.   

- ఇద్దరూ ఎన్‌95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది.   

మరోవైపు కొంతమంది నిబంధనల కోసం మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు. అలాంటప్పుడు ఏ రకం మాస్క్‌ పెట్టుకున్నా ప్రయోజనం శూన్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ధరించే మాస్క్‌ తప్పకుండా ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగైతేనే వైరస్ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేస్తున్నారు.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.