పెరగనున్న వరదలు.. తగ్గనున్న పంటలు.. ప్రమాదపుటంచున ప్రపంచం

Publish Date:Oct 29, 2021

Advertisement

విధాన నిర్ణేతలందరూ రాజకీయ నాటకాలు రక్తి కట్టించడంలో తలమునకలై ఉండగా...  ప్రకోపిస్తున్న ప్రకృతి తన ధ్వంస రచనలో బిజీగా ఉంది. ఎన్నికైన ఐదేళ్ల కాలంలో ప్రజా భద్రతను, సంక్షేమాన్ని మరింత సురక్షితం చేసేందుకు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన శాసనకర్తలు ఫక్తు రాజకీయ పందేరాలకే పరిమితమైపోతున్నారు. ఫలితంగా వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతూ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉదాహరణకు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే వరదల సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. మూసీ ఉప్పొంగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఆ తరువాత ఆ విషయాన్ని అటకెక్కించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల, ఆయా ప్రభుత్వాల వైఖరి కారణంగానే ఈ ప్రపంచం సమీప భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోబోతోందని పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, మానవ సమాజ క్షేమాన్ని కాంక్షించే పలు దేశాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం రాజకీయ పదవులు కాపాడుకోవడం చుట్టూనే కాలమంతా గడిచిపోతోందన్న అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. 

మరికొన్ని గంటల్లో రోమ్ లో జరిగే 16వ జి-20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్న తరుణంలో... గ్లోబల్ వార్మింగ్ పై ఐరాస ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక విడుదల చేసింది. 40 మంది పర్యావరణవేత్తలు గ్లోబల్ వార్మింగ్ పై అధ్యయనం చేసి ఆ రిపోర్టును విడుదల చేశారు.

ఆ రిపోర్టులో ముఖ్యంగా భారత్ అప్రమత్తం కాకపోతే తలెత్తే ఉపద్రవాలపై కూలంకషంగా చర్చించారు. రాబోయే 15-20 ఏళ్లలో ఇదే ప్రకారం 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు భారత్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే వేడిగాలులు, విపరీతమైన వరదలు, పంటల్లో క్షీణత, చేపల ఉత్పత్తిలో తగ్గుదల 25 రెట్లు పెరుగుతుందని హెచ్చరించారు. ఇదే హీట్ వేవ్స్ 2 డిగ్రీలకు పెరిగితే గనక పైన చెప్పుకున్న దుష్పరిణామాలు 5 రెట్లు పెరుగుతాయని... ఒకవేళ కనీసంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినా పైన చెప్పుకున్న ప్రకృతి బీభత్సం ఒకటిన్నర  రెట్లకన్నా ఎక్కువ బీభత్సం తలెత్తుతుందని హెచ్చరించారు. 

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోటీ 80 లక్షల మంది భారతీయుల జీవితాలు రిస్కులో పడతాయని, ఆ వేడిగాలుల కారణంగా హిమానీనదాాలు పెరగడం, అకాల వర్షాలు, వరద బీభత్సాలకు దారితీస్తుందని రిపోర్టు వెల్లడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటా ఇండియాలో కోటీ 30 లక్షల మంది నిరాశ్రయులవడమో, నివాసాలు కోల్పోవడమో, సహాయ శిబిరాల్లో తల దాచుకోవడమో, వారిలో కొందరు గల్లంతవడమో జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా గత ఐదారేళ్ల వరదలతో పోలిస్తే వరద బీభత్సాలు గణనీయంగా పెరగడం ఇక్కడి ప్రజలకు అనుభవంలో ఉన్నదేనని గమనించాలి. 

అంతేకాదు... అదుపులేని గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెరుకు, వరి, గోధుమ పంటలు దారుణంగా పడిపోతాయని, కరువు కాటకాలు విజృంభిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పంటలకు 29 శాతం నీటి డిమాండ్ పెరుగుతుందంటున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా వంటి పెద్ద దేశాల్లో దావనలాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో కూడా గమనించాలని నిపుణులు అంటున్నారు. పంటల క్షీణత కారణంగా, ఇంకా చెప్పాలంటే వరి, గోధుమ వంటి పంటల ఉత్పత్తి క్షీణించిపోవడం వల్ల భారత్  2050 నాటికి 81 బిలియన్ యూరోల ఆదాయం కోల్పోతుందని, 15 శాతం రైతుల ఆదాయం దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మిట్ కు హాజరవుతున్న ప్రధాని మోడీ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తారోనని పలు జీ-20 దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.