న్యాయ సంరక్షణలో ఆయనే సుప్రీం! సీజేఐ జస్టిస్ రమణకు జనం జేజేలు..
Publish Date:Oct 9, 2021
Advertisement
మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా, అత్యున్నత పదవులను నిర్వర్తించిన వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. అయితే, అందులో కొందరే, తాము అలంకరించిన పదవులకు మరింత హుందాతనాన్ని, గౌరవాన్ని చేరుస్తారు. కొత్త అందాలు అద్దుతారు. అలా పదవుల వాళ్ళవల్ల తమకు కాకుండా తమ వ్యక్తిత్వ పరిమళాలతో పదవుల ప్రతిష్టను పెంచిన వ్యక్తులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా నడుస్తున్న చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఒకరు.ఆయన మన తెలుగువారు కావడం, మనకు మరింత గర్వకారణం. సుప్రీం కోర్టు ప్రాధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఎన్వీరమణ పోషిస్తున్న పాత్ర, అనేక సందర్భాలలో సామాన్యుల నుంచి న్యాయకోవిదుల వరకు అందరి ప్రశంసలు అందుకుంటోంది.ఇప్పడు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అద్భుత పనితీరు కనబరుస్తున్నారని, నిజమైన రాజ్యాంగ సంరక్షుడి పాత్రను పోషిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్’లోని లఖింపుర్ ఖేరి ఘటనపై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యవహరించిన తీరుపై.. ప్రముఖ పాత్రికేయుడు కరణ్థాపర్తో దవే ముఖాముఖి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన, లఖింపుర్ ఖేరి కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రజలకిచ్చిన సందేశం ఎంతో సానుకూలంగా ఉందని అన్నారు. దేశ ప్రజలకు నిజమైన కాలపాదారు సుప్రీంకోర్టేనని ప్రధానన్యాయ మూర్తి స్పష్టం చేశారని అన్నారు . అసాధారణ రీతిలో విచారణ చేపట్టి... ఎంతో నమ్మకం కలిగించారని దవే పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని జస్టిస్ ఎన్.వి.రమణ ముందుండి నడిపిస్తూ, రాజ్యాంగానికి నిజమైన కాపలాదారుగా దాన్ని నిలిపారని ప్రశంసించారు.”ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రధానన్యాయమూర్తి పనిచేస్తుండటం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు న్యాయ వ్యవస్థపై నిరంతరం ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా పనిచేసే న్యాయమూర్తులకు లాయర్లు అండగా నిలవాలి. తాను చేసిన రాజ్యాంగబద్ధ ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్టు సీజేఐ రోజురోజుకూ నిరూపించుకుంటున్నారు’’ అని దవే పేర్కొన్నారు. నిజానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చెప్పట్టిన తర్వాత, జస్టిస్ ఎన్వీ రమణ ఎంతో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని అందరూ అంటూనే ఉన్నారు.ప్రతి రోజు ఏదో ఒక విశేష వ్యాఖ్య, విమర్శ, సూచనతో పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు జస్టిస్ ఎన్వీరమణ మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నారు. సహజంగా న్యాయమూర్తులు, మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులు పత్రికలో అంతగా కనిపించరు. కానీ, జస్టిస్ ఎన్వీరమణ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రతి రోజు ప్రజలకు చేరువవుతూనే ఉన్నారు. అంతేకాదుతద్వారా న్యాయ వ్యవస్థ పట్ల సామాన్య ప్రజల్లోనూ విశ్వాసం పెంచుతున్నారని న్యాయకోవిదులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cji-justice-ramana-mark-on-supreme-court-39-124277.html





