రాజకీయ నేర సంబంధాలకు ముగింపు లేదా? సుప్రీం సీరియస్ తో సీన్ మారేనా.. 

Publish Date:Aug 26, 2021

Advertisement

రాజకీయ నేర సంబందాల గురించి మన దేశంలో జరిగినంత చర్చ బహుశా మరే దేశంలోనూ జరిగి ఉండదేమో,కానీ, రాజకీయ నేర సంబందాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 78 మంది సభ్యులుంటే, అందులో 33 మీద, అంటే 42 శాతం మంది మత్రులపై క్రిమినల్ కేసులున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్  రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అందులో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే, దేశం మొత్తంలో 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై, క్రిమినల్ కేసులున్నాయి.

ఇవ్వన్నీ కూడా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫ్ఫిడవిట్ల పరిశీలించిన నిర్ధారించిన నిజాలు. ఇలా, చట్టసభల సభ్యుల నేర చరిత బరువు పెరిగిపోవడానికి ఇంకా కారణలు ఉంటే ఉండవచ్చును, కానీ, నేర విచారణలో , న్యాయ విచారణలో  జరుగతున్న జాప్యం ఒక  మూల కారణం. ఏడీఆర్నివేదిక ప్రకారం, ఎంపీలపై నమోదైన కేసుల సగటు పెండింగ్ వయసు ఏడేళ్ళు, ఎమ్మెల్యేల కేసుల పెండింగ్ వయసు ఆరేళ్ళు. ఇంకా ఆసక్తికర విషయం, తొమ్మిది మంది ఎంపీ, ఎమ్మెల్యేలలపై 25 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్’లో ఉన్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అయితే, ఇంచుమున్చుగా దశాబ్ద కాలంగా ఆలా సాగుతూనే ఉన్నాయి. ఓడజనుకు పైగా చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయన్ని  సీబీఐ 2012 మే 25 న తొలిసారి అరెస్ట్ చేసింది. ఓ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యేవరకు కనీసం వారానికో సారి, కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదో ఒక సాకున కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు పొండుతున్నారు. ఇక బైలు రద్దు కోరుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు దాఖలు చేసిన, పిటీషన్విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వస్తుందని అంటున్నారు. అయితే, ఈ కుసు నడత తీరును గమనిస్తే అప్పటికైనా తుడు తీర్పు వస్తుందా అనే విషయంలో ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.  

ఈ నేపధ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబదించిన సీబీఐ, ఈడీ కేసుల సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు. 

అయితే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అగ్రాహం ఆవేదన వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు.న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఎప్పుడో దశాబ్దం ముందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఉపాధ్యాయ్ తమ పిటీషన్ లో కోరారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని  కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే. అయితే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో తెలియకుండా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అసలు సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి ... ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కితేనే కాని, చిక్కు ముడి వీడదు ... అంత వరకు  రాజకీయ నేర సంబంధాలు ముగింపులేని టీవీ సీరియల్  లాగా నడుస్తూనే ఉంటుంది.

By
en-us Political News

  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.