ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఐఐ సదస్సు

Publish Date:Oct 13, 2025

Advertisement

అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 

రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక  కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  విశాఖపట్నంలో  వచ్చే నెల 14, 15 తేదీలలో  రెండు రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ సన్నాహకాలపై ఆయన సచివాలయంలో  సోమవారం (అక్టోబర్ 13)   ఆయన సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్‌ను  ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.  వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను కూడా ఈ సదస్సుకు ఆహ్వాచించాలని ఆయన అదికారులకు నిర్దేశించారు.  దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లకు ఈ సదస్సులో   ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశంచేశారు.  ఈ సదస్సు సందర్భంగా విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆయన అలాగే సదస్సుకు వచ్చే ప్రతినిథులకు మంచి ఆతిథ్యమివ్వాలన్నారు.  

గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే ఏఐ, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలన్నారు.  ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. 

ఇలా ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో సీఐఐ సదస్సు నిర్వహించడం ఇది నాలుగో సారి.  గతంలో 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్ల పాటు మూడు  విశాఖలో వేదికగానే సీఐఐ సదస్సులు జరిగాయి.  ఇప్పుడు జరగనున్న ఈ సీఐఐ సదస్సు  టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్  థీమ్‌తో  నిర్వహించనున్నారు. మొత్తం 13 సెషన్లుగా జరిగే ఈ సదస్సులో..  29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు  హాజరవుతారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. 

ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.