ఆమె సీఈవో.. అత‌ను ఓ యోగి.. ఇద్ద‌రి మ‌ధ్య 'అదృశ్య' స్టోరీ!

Publish Date:Feb 17, 2022

Advertisement

చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. ఇప్పుడామె సెబీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధ‌మూ ఉంది. శాల‌రీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిల‌బ‌డ‌టానికి కార‌ణం.. ఓ హిమాల‌య యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ. 

చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు. 

20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. ఇక‌, చిత్ర రామకృష్ణ హయాంలో NSE చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించడం.. కొంత‌కాలానికే ఆయ‌న్ను గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం అనుమానాస్ప‌దంగా మారింది. ఇక‌, సెబీ ద‌ర్యాప్తులో మ‌రిన్ని సంచ‌న‌ల విష‌యాలు వెలుగుచూశాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ ‘అదృశ్య’ యోగి ప్రభావానికి లోనైనట్టు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు గుర్తించారు. 

ఆ యోగి చెప్పార‌నే.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌ను ఎన్ఎస్ఈలో ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అంత‌కుముందు ఆనంద్‌ జీతం 15లక్షలు ఉండ‌గా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 1.38 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ ఇయ‌ర్‌కే అతడి శాల‌రీ 20శాతం పెంచేశారు. వారానికి 3 రోజులు మాత్రమే వ‌ర్కింగ్ డేస్‌గా వెసులుబాటు కూడా క‌ల్పించారు. ఇదంతా ఆ హిమాల‌య‌ యోగి చెప్పినందుకే.. చిత్ర రామ‌కృష్ణ‌.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు అలాంటి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇచ్చార‌ని సెబీ దర్యాప్తులో తేలింది.   

ఇంత‌కీ ఆ హిమాల‌య యోగ ఎవ‌రు? ఆయ‌న‌తో చిత్ర‌కు ఎలాంటి సంబంధం ఉంద‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రం. ఆ యోగి ఓ నిరాకారుడని, సిద్ధ పురుషుడు, శిరోణ్మని అని చిత్ర చెబుతున్నారు. తన వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఆయన నుంచి ఏళ్లుగా స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని, ఆయన ఎలా కావాలంటే అలా మారుతార‌ని.. ఆయ‌న హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉంటార‌ని.. చిత్ర సెబీ విచార‌ణ‌లో తెలిపారు. 

అయితే, సెబీ దర్యాప్తులో ఆ అదృశ్య యోగి.. మనిషేనని తేలింది. ఆ యోగికి, చిత్ర‌కు, ఆనంద్‌ సుబ్రమణియన్‌కు ఎలాంటి లింక్ ఉంద‌ని ఆరా తీస్తోంది. ఇక‌, ఆ యోగితో చిత్ర ఈ-మెయిల్ సంభాష‌ణ‌లు కూడా జ‌రిపార‌ని సెబీ ద‌ర్యాప్తులో తేలింది. వారిద్ద‌రి మ‌ధ్య న‌డిచిన మెయిల్స్‌లో ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన ఆ యోగి.. ఆమె శిరోజాలపై ఆసక్తి చూపారు. జడను వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెకు కొన్ని పాటలు షేర్ చేశారు. ఇద్దరూ కలిసి సీషెల్స్‌కు వెళ్లారనీ తెలుస్తోంది. 

2015 ఫిబ్రవరి 18న చిత్రారామకృష్ణకు ఆ వ్యక్తి పంపిన ఇ-మెయిల్‌లో 'ఇవాళ నీవు చాలా బాగున్నావు. నీ శిరోజాలుగా వివిధ రకాలుగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా, దీన్ని నువ్వు స్వీకరిస్తావని తెలుసు' అని ఉంది. అంతకు ముందు రోజు ఇమెయిల్‌లో 'నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. మనం వెళ్లేదారిలో హాంకాంగ్‌ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు'.. అంటూ ఆ మెయిల్‌లో రాసుంది. 

2015 సెప్టెంబరు 16 నాటి ఇ-మెయిల్‌లో ఇలా ఉంది.. 'నేను పంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్చితంగా వినాలి. నీ మది నుంచి నీ మోముపైకి వచ్చే చిరునవ్వును చూస్తున్నపుడు నాకు ఆనందంగా ఉంటుంది. నిన్న సమయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్నచిన్న విషయాలు నిన్ను శక్తిమంతంగా, తక్కువ వయస్సు అనిపించేలా చేస్తుంది' అని రొమాంటిక్ యాంగిల్‌లో ఉంది ఆ మెయిల్ సారాంశం. ఇలా చిత్ర రామ‌కృష్ణ ఈ-మెయిల్స్ ప‌రిశీలించిన సెబీ ద‌ర్యాప్తు బృందం.. ఆమె చెబుతున్న‌ట్టు అత‌ను అదృశ్య యోగినో.. హిమాల‌య యోగినో కాక‌పోవ‌చ్చ‌ని.. ఓ అదృశ్య వ్య‌క్తి అయి ఉంటార‌ని అంటోంది. ఇక‌, ఆ వ్య‌క్తికి ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఆయ‌నే ఈయ‌నా? చిత్ర ఆ వ్య‌క్తి బుట్ట‌లో ప‌డిందా?  చిత్ర‌నే ఇలా అదృశ్య డ్రామా ప్లే చేస్తోందా? అనే కోణంలోనూ సెబీ విచారిస్తోంది. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.