చిరంజీవికి ఇంటర్యూ ఇవ్వని సోనియా

Publish Date:Aug 2, 2012

Advertisement

రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఢల్లీిలో నిరాశ ఎదురైంది.  సోనియాను వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న చిరు ప్రయత్నం బెడిసికొట్టింది. తన కేంద్ర మంత్రి పదవిపై మాట్లాడేందుకు సమయం ఇవ్వ వలసిందిగా ఆయన సోనియా కార్యాలయాన్ని సంప్రదించగా మరో 15 రోస్త్రల వరకూ వెయిట్‌ చేయాలని సమాధానం వచ్చింది.దీంతో  చిరంజీవికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతుందన్న ఉహాగానాలు చెలరేగాయి.


తనకు  మంత్రిపదవి ఇవ్వకుండా అవసరానికి ఉపయోగించుకొని వదిలేశారని, చిరంజీవి తన అనునాయుల దగ్గర వాపోతున్నట్లు తెలిసింది.కీలక సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు రాజ్యసభ సభ్యత్వం  ఇచ్చి చేతులు దులుపుకున్నారని, పార్టీ విలీన సమయంలో జరిగిన ఒప్పందాలను మర్చిపోయారని చిరంజీవి భావిస్తున్నారు.



అయితే కేంద్రంలో ఇంకా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నందున ఇకముందైనా తనను మంత్రిని చేయక పోతారా అన్న  ఆశతో ఆయన  ఉన్నట్లు తెలిసింది. కేంద్రం ఇటీవల  క్యాబినెట్‌లో మంత్రిపదవులను  సర్ధుబాటు చేసింది తప్ప పెద్దగా  మార్పులు చేర్పులు ఏమీ చేయకపోవడం గమనార్హం.



చిరంజీవి సంతోషపడే విషయం ఏమంటే రెండు నెలలు క్రిందట చెన్నయ్‌లో తన పెద్దకుమార్తె ఇంటి వద్ద ఆదాయ పన్ను అధికారులు స్వాధీన పర్చుకున్న 35 కోట్ల రూపాయలకు  టాక్సు కట్టించుకొని నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మార్చి చిరంజీవికి అప్పగించినట్లు తెలిసింది. అది చిరంజీవి డబ్బే అని దానిని తన కుమార్తె  దగ్గర దాచివుంచారని అప్పట్లోనే మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మంత్రిపదవి రాకపోయినా డిల్లీతో ఉన్న  సంబందాలు తన డబ్బును వెనక్కి తెచ్చుకోవడంతో ఉపయోగ పడినందుకు చిరంజీవికి ఆనందమే కదా!

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.