Publish Date:Sep 16, 2024
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం కలిసారు. సిఎంరిలీఫ్ పండ్ కు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తన కుమారుడు రాంచరణ్ తరపున కూడా 50 లక్షల చెక్కును సిఎంరిలీఫ్ ఫండ్ కు అంద జేశారు. చిరంజీవి సచివాలయానికి వచ్చినప్పుడు మంత్రి సీతక్క కూడా అక్కడే ఉన్నారు చెరో రెండు చెక్కులను అంద జేయడానికి వచ్చిన మెగాస్టార్ తో రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. యుపిఎ హాయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేసిన సంగతితెలిసిందే. వీరి భేటీలో తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లో వచ్చిన చిరంజీవి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి పదవిని అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్నిపునరుద్దరించుకోని చిరంజీవి ఆ పార్టీకి దూరమయ్యారు. రాజీనామా చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదు. ఎపిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూటమి ప్రభుత్వానికి మద్దత్తు పలికారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన జనసేన 21 స్థానాలు పోటీ చేసి అన్ని స్థానాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల కంటే సినిమాల మీద కాన్ సన్ ట్రేట్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-gave-a-check-to-the-cm-relief-fund-25-184908.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.