Publish Date:Sep 16, 2024
ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది. తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూనియర్ డ్యాన్సర్(21) ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢీషో ద్వారా టాలివుడ్ లో అడుగుపెట్టటిన కొరియాగ్రాఫర్ అనతి కాలంలో మంచి గుర్తింపు పొందారు అగ్రహీరోలకు కొరియాగ్రాఫర్ గా పని చేశాడు. ఔట్ డోర్ షూటింగ్స్ కోసం ముంబై, చెన్నయ్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు తనను పలుమమార్లు అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ లో ఉంటున్న తన ఇంటికి కూడా తరచూ వస్తూ లైంగికంగా వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదు చేశారు. విచారణ కోసం ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బిఎన్ఎస్ (370) సెక్షన్ క్రింద జాని మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 506,323 లోని క్లాజ్ 2. క్లాజ్ 2ఎన్ సెక్షన్ల క్రింద వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జానీ మాస్టర్ పై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-sex-case-against-famous-choreographer-johnny-master-25-184904.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.