ఇక స్పీకర్ ను కలవకూడదని జగన్ వర్గం నిర్ణయం
Publish Date:Jan 18, 2012
Advertisement
హైదరాబాద్: తమ రాజీనామాలపై ఇకపై అసెంబ్లీస్పీకర్ను కలువకూడదని జగన్ వర్గ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామనివారన్నారు. మరోసారి ప్రయోజనం ఏమిటన్న ధోరణిలో వారు ఉన్నట్టు సమాచారం. అనర్హత వేటు విషయంలో 18వ తేది నుండి 21వ తేది మధ్య జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది శాసనసభ్యులు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయమై ఎమ్మెల్యేలు ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్ర బోస్, శోభా నాగి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము గతంలోనే స్పీకర్ ఎదుట హాజరయ్యామని మరోసారి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. గతంలోనే చెప్పాల్సిందంతా చెప్పామని, మళ్లీ విడివిడిగా పిలవడమేమిటన్నారు. రాజీనామా, అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. ప్రజారాజ్యం పార్టీ అనేది లేనప్పుడు తాను ఎవరికి వివరణ ఇస్తానని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. చిరంజీవి పిఆర్పీ అధినేతగా ఉంటే తాను వివరణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-24-11009.html





