చింతమనేనిని చంపాలనుకున్నారా?

Publish Date:Aug 31, 2021

Advertisement

చింతమనేని ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో సంచలనం. ప్రజా పోరాటమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా... అధికార పార్టీలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆయన రూటే సెపరేటు. నిత్యం ఎదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటారు. ప్రజల కోసం కొన్ని సార్లు  అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తూ ఇబ్బందుల్లో పడుతుంటారని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. దెందులూరు నుంచి అసెంబ్లీకి పలుసార్లు గెలిచారు. గత టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు చింతమనేని ప్రభాకర్.

ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. తన పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలకు దూరం కాలేదు చింతమనేని. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాంటూ ధైర్యం ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని తమకు ఇబ్బందిగా మారారని భావించిన అధికార పార్టీ ఆయనను టార్గెట్ చేసిందని చెబుతారు. అందుకే ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు చింతమనేని. అయినా తన తీరు మాత్రం మార్చుకోకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. 

ఆదివారం మరోసారి చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం శ్రీదారాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో నర్సీపట్నం వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,  గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్,  ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం భీమడోలు సర్కిల్ ఇన్స్స్ పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి, విడిచిపెట్టారు. చింతమనేని అరెస్ట్ , తర్వాత ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

విశాఖ జిల్లాలో తనను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఘటనలు వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు చింతమనేని ప్రభాకర్. పోలీసులు తనను చంపేస్తారని అనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం నుంచి తనను చింతపల్లికి తీసుకెళ్లారని తెలిపారు చింతమనేని. తనకు అదే చివరి క్షణం అని అనుకున్నానని... ఆ దట్టమైన అడవుల్లో తనను కాల్చేసి, నక్సలైట్లు కాల్చేశారని చెపుతారేమోనని భావించానని అన్నారు. రక్షకభటులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకభటులుగా మారారని మండిపడ్డారు. తనకు నక్సల్స్ తో ప్రమాదం ఉందని చెపుతున్నారని... కానీ, తనకు ప్రమాదం నక్సల్స్ తో లేదని, పోలీసులతోనే తనకు ప్రమాదమని అన్నారు. తన అరెస్ట్ వెనుక వైసీపీ కుట్ర ఉందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.