చింతకాయల ఝలక్... ఎంపీ మాధవ్‌కు కొత్త చిక్కులు!

Publish Date:Aug 5, 2022

Advertisement

 ఎంపీ గోరంట్ల మాధవ్ పై తెలుగుదేశం ప్రధాన కార్యదర్వి చింతకాలయ విజయ్ రూ. 50లక్షలకు పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం (ఆగస్టు 5) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనీ విషయం తెలిపారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడైన చింతకాలయ విజయ్ ఈ సందర్భంగా మరోసారి గోరంట్ల మాధవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అసహ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడటమే కాకుండా.. బుకాయింపు కూడానా అని గోరంట్లపై మండి పడ్డారు. తనపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేసినందుకే మాధవ్ పై పరువునష్టం దావా వేసినట్లు చెప్పారు. ఎంపీ హోదాలో ఉన్న గోరంట్ల మాధవ్ చేసిందే దగుల్బాజీ పని.. నగ్నంగా మహిళలో వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయిన ఆయన సిగ్గుతో తలదించుకోవలసింది పోయి నా పై ఆరోపణలు చేయడమేమిటని నిలదీశారు.

ఎంత ఎంపీ అయినా.. చట్టం ముందు ఆయన సామాన్యుడేనని చింతకాలయ విజయ్ అన్నారు.  దిక్కుమాలిన పని చేసి తమపై నిందలేయడం దారుణమన్నారు. పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. గోరంట్ల మాధవ్ దిక్కుమాలిన పని చేసి దొరికిపోవడమే కాక.. తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై నిందలేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తనకు సంబంధించిన వీడియో బయటకు తెచ్చింది తానే అనడం సరికాదన్నారు. అసలు ఆ వీడియోకు, తనకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా అన్నారు. ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఏం సంబంధమో సమాధానం చెప్పాలన్నారు. ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పడం పోయి.. తనను విమర్శించడమేంటి అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు.. ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

మాధవ్ సుందర ప్రతి బింబాన్ని చూసేందుకు ఎవరికీ అంత గుండె ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు.  పార్లమెంటులో ఏపీ పరువు తీశారన్నారు. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వారి నాయకుడు అంటే.. జనం నమ్మి సీట్లిస్తే.. ఇదా ప్రత్యేక హోదా అటూ ప్రశ్నించారు. ఇలాంటి న్యూడ్ వీడియోలేనా వారు తెచ్చే స్పెషల్ స్టేటస్.? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్.? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులు అంటూ ధ్వజమెత్తారు.  ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకే పరువునష్టం దావా వేశానని ఆయన స్పష్టం చేశారు.  పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.  మాధవ్‌పై అధినేత జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయ్ ప్రశ్నించారు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.