రాజుల కాలంలో గూఢచర్యం కోసం గతంలో పావురాలను ఉపయోగించేవారని చదువుకున్నాం. పావురాలను వందల కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రదేశంలో వదిలేసినా అవి ఎక్కడి నుంచి వెళ్లాయో తిరిగి అక్కడికి చేరుకోగలవు. తమ శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు పావులరాలను ఉపయోగించేవారు. రాయాబారాలకు కూడా పావురాలను వాడేవారు గతంలో. తాజాగా అలాంటి పావురాలే కనిపిస్తుండటం కలకలం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. కాళ్లకి చైనాకి సంబంధించిన ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కుడికాలుకి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్‌ను గమనించారు. ట్యాగ్‌పై AIR 2207 అనే కోడ్ నంబర్ ఉంది. అయితే ఇది చైనా పావురం అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు స్థానికులకు చిక్కాయి. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని రవురెక్కలా ప్రాంతంలోనూ.. మంగళవారం కేంద్రపడ జిల్లా మార్ సగై పోలీస్ స్టేషన్ పరిధి దశరథపుర్‌లో మరోటి దొరికాయి. వీటిలో ఒక పావురం కాలికి వీహెచ్ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉండగా.. మరో పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ ఉన్నాయి.
సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు అతడు గుర్తించాడు. దానిపై చైనీస్ భాషలో అక్షరాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
పూరీ-కోణార్క్ మార్గంలో అనుమానాస్పదంగా మరో పావురం కనిపించింది. దీని రెండు కాళ్లపై రింగులు ఉండగా.. కోడ్ భాషలో సీరియల్ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ పక్షులను గూఢచర్యానికి చైనీయులు ఉపయోగిస్తున్నారని అనుమానం కలుగుతోందని పూరీకి చెందిన అలోక్ పాలేయ్ అన్నారు. కాళ్లకు అమర్చిన రింగులపై ఉన్న కొండ గుర్తులు చూస్తే ఇవి చైనా గూఢచారి పావురాలేనని అర్ధమవుతోందని తెలిపారు. అయితే పావురం కాలికి ఉన్న బ్యాడ్జ్‌లపై ఎటువంటి అక్షరాలు, కెమెరా, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్‌లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, స్థానికులు కూడా కొన్నిసార్లు తమ పక్షులను గుర్తించడానికి కొన్ని బ్యాడ్జ్‌లను పెడుతుంటారని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/china-spying-pigeon-in-cheemakurthy-39-129646.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.