విజయసాయిరెడ్డి... మార్పులో మతలబేంటి?

Publish Date:Apr 20, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు జన్మదినం గురువారం (ఏప్రిల్ 20) ఆయనకు   పార్టీ నుంచి, ప్రజల నుంచీ, వివిధ రంగాల ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వైసీపీ విజయసాయిరెడ్డి  ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, అదీ ఎంతో అభిమానంతో, గౌరవంతో మర్యాదపూర్వక భాషలో తెలియజేయడం అన్ని వర్గాల వారినీ సంభ్రమాశ్చర్యలలో ముంచెత్తింది.  సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నావిజయసాయిరెడ్డి చంద్రబాబుకు తెలిపిన అభినందనలు రాజకీయవర్గాలలోనే కాదు సామాన్య జనంలో కూడా కొత్త చర్చకు దారితీశాయి.

విజయసాయి ట్వీట్లు.. అవి అభినందించడానికి చేసినా సాధారణంగా విమర్శలు, వెటకారాలు, అనుచిత భాషా ప్రయోగాలతో ఉంటాయి. ఆయన గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్లు చూస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది. అయితే ఈ సారి మాత్రం విజయసాయి చంద్రబాబుకు తెలిపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చాగంటి వారి ప్రవచనంలాగా చాలా మర్యాద, మన్ననా ఉట్టిపడుతూ ఉంది.  ఇదే సర్వత్రా చర్చకు కారణమైంది. రాజకీయవర్గాలలో విజయసాయిలో వచ్చిన ఈ మార్పు పట్ల పలు కోణాల్లో చర్చ జరుగుతోంది.

విజయసాయి చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.  గతంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరుకీ... ఇప్పుడ ఆయన స్పందించిన తీరుకు చాలా చాలా వ్యత్యాసం ఉందనీ,సీఎం జగన్ భాషలో లా  నాడు – నేడు కార్యక్రమం స్టైల్‌లో చెప్పాలంటే   చాలా చాలా ఉదాహరణలతో చెప్పొచ్చని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు  లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా..  విజయసాయిరెడ్డి ఎలా చెలరేగిపోయేవారో గుర్తు చేస్తున్నారు. 

ఇంతకీ..  విజయసాయిరెడ్డిలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి.. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సమీప బంధువని.. అయితే తారకరత్న మృతి నేపథ్యంలో వారి ఇంట విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారని.. ఆ క్రమంలో తారకరత్న నివాసానికి వచ్చిన  చంద్రబాబు, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణతో ఈ విజయసాయిరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారని.. ఈ ఎపిసోడ్ తర్వాత విజయసాయిరెడ్డిని  జగన్ సాధ్యమైనంత దూరం పెట్టారనీ,  ఇటీవలి కాలంలో విజయసాయికి వైసీపీ కార్యక్రమాలలో కానీ,   వ్యవహారాలలో కానీ కనీస ప్రాతినిథ్యం లేకుండా పోయిందని అంటున్నారు. 

మరో నెటిజన్ అయితే  వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడాకు తరలించారని... మరికొద్ది రోజుల్లో వైయస్ అవినాష్‌రెడ్డికి  సైతం శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదంటూ ఓ ప్రచారం అయితే బయట జోరుగా సాగుతోందని... అటువంటి తరుణంలో  జగన్... పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో భేటీ అయి.. ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారని... కానీ ఈ భేటీకి విజయసాయిరెడ్డిని దూరంగా ఉంచిన సంగతిని గుర్తు చేస్తూ..  జగన్..  తనను దూరం పెడితే.. తాను సైతం ఆయనను దూరం పెట్టగలనన్న సంకేతాన్ని విజయసాయి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ట్వీట్ ద్వారా ఇచ్చారని వివరించాడు.  ఏది ఏమైనా ఏదో అడ్వర్టైజ్ మెంట్లలో మరక మంచిదే అన్నట్లు.. విజయసాయిలో వచ్చిన ఈ మార్పు కూడా మంచికే నంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.