భయపెట్టిన జగన్.. భయపడుతున్నారా?

Publish Date:May 8, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల  ఊహాగానాలతో పాటు పొత్తుపడుపుల అంచనాలూ జోరందుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఎన్నికల కోసం తొందరపడుతున్నదీ, ఎన్నికలంటే భయపడుతున్నదీ  ఒక్క అధికార పార్టీ వైసీపీ మాత్రమే. గత నాలుగు సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల నుంచీ అసమ్మతి మూటగట్టుకోవడమే కాకుండా సొంత పార్టీలో కూడా అసమ్మతి కుంపట్లు రగిల్చిన వైసీపీ యిప్పుడు ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోంది.

అదే సమయంలో ఎన్నికలంటే ఓటమేనా అన్న భయంలోనూ ఉంది. ఈ అభిప్రాయం రాజకీయవర్గాలలో కలగడానికి ఆ పార్టీ అధినేత జగన్ సహా, సీనియర్ నేతలు చేస్తున్న ప్రకటనలే కారణం. పార్టీలో అసమ్మతి గళాలు పదునెక్కుతున్నాయి.. నేరుగా అధినేత విధానాలనే విమర్శిస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది.  అదే సమయంలో  జగన్  ను కూడా వరుసగా చిక్కులు చుట్టుముట్టాయి. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైఎస్ సమీప బంధువు అవినాష్ రెడ్డి బయటపడలేనంతగా యిరుక్కుపోవడం, ఆయన అరెస్టునకు యిన్నాళ్ళుగా రక్షణ కవచాలుగా నిలిచిన కోర్టులు.. అరెస్టునకు లైన్ క్లియర్ చేయడం..  అదే సమయంలో హత్య జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ విషయంలో గతంలో జగన్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా యిప్పుడు అవినాష్ మీడియా సమావేశాలలలోనూ, సెల్ఫీ వీడియోలలూనూ మాట్లాడుతుండటంతో జగన్  చిక్కుల్లో పడ్డారనీ, ఆ కేసు విషయంలో జగన్ తీరు పట్ల పొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోందనీ పరిశీలకులుఅంటున్నారు.

అదే సమయంలో  మాట తప్పను మడమ తిప్పను  అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి   యిప్పుడు తనను ధిక్కరించే వారిని బుజ్జగించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే.. పార్టీపై ఆయనకు ఉన్న పట్టు సడలందన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, 2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాయాలకు, మంత్రుల ఉద్వాసనతో చికిత్స చేయాలనే నిర్ణయానికీ వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఐదారుగు,మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచన కూడా చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించాలనీ భావించారు.

అయితే వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం కావడం, దానిని ఆపేందుకు ఆయన హస్తిన వెళ్లి మరీ చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో  ఆయన టోన్ మారడం... హస్తినలో ఆయనకు సీన్ రివర్స్ అవ్వడమే కావడం కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే మంత్రులకు ఉద్వాసన, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలోచనను విరమించుకున్నారనీ విశ్లేషిస్తున్నారు.  అందుకే గడపగడపకూ టెస్ట్ లో ఫెయిలైన మంత్రులు, ఎమ్మెల్యేల (వీరి సంఖ్య దాదాపు 40 వరకూ ఉంటుందని అంచనా) పై వేటు కాదు సరికదా కనీసం మందలింపు కూడా చేయలేని పరిస్థితుల్లో  ప్రస్తుతం జగన్ ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే, టిక్కెట్ విషయం ధృవీకరించురకునేందుకు జగన్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని  చెప్పడంతో...  ఆ ఇద్దరూ.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో .. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమన్న చందంగా ఆత్మ ప్రభోధం మేరకు ఓటు వేశారు.  యిలాంటి  తక్షణ తిరుగుబాటును ఊహించని జగన్  కంగుతిన్నారు.

 అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకోవడంతో  జగన్ రెడ్డి  షాక్’కు గురయ్యారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు, ఇంటెల్జెన్సీ వర్గాల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయో ఏమో కానీ, ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి పెట్టవలసిన నాలుగు పెట్టి పంపారని అంటున్నారు. నిజానికి, కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే విషయంలో  అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించినా, నిజానికి ముఖ్యమంత్రి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ పెద్దల ‘ఆదేశం’ మేరకే ఆయన హస్తిన వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇంటెల్జెన్సీ వర్గాలు అందించిన సమాచారం మేరకే, ఢిల్లీ పెద్దలు జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి పరిస్థితిని వివరించారని అంటున్నారు.

అందుకే విషయ తీవ్రతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాగా పొద్దుపోయిన తర్వాత, అర్థ రాత్రికి అరగంట ముందు జగన్ రెడ్డికి  అప్పాయింట్మెంట్ ఇచ్చారనీ, అంతే కాకుండా ఆ  సందర్భంగా ముఖ్యమంత్రి తమ ధోరణి మార్చుకోకపోతే, చాలా పెద్ద సంఖ్యలో,  ఇంచు మించుగా హాఫ్ సెంచరీ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అమిత్ షా  జగన్ ను హెచ్చరించినట్లు చెబుతున్నారు.  అందేకే హస్తిన నుంచి తిరిగి వచ్చిన తరువాత  జగన్ అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో.. అలాగే గడపగడపకు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని ఎమ్మెల్యేల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకుని బుజ్జగింపుల పర్వంలోకి దిగారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.