అభిమానితో చంద్రబాబు ఆత్మీయ భేటీ

Publish Date:Jun 9, 2026

Advertisement

రాజకీయాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉంటారు. కానీ, కొందరు నాయకులు ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటారు. దానికి కారణం వారికున్న ప్రజాదరణ మాత్రమే కాదు, వారిలో దాగున్న మానవత్వం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఇలాంటి ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన ఘటనే చోటుచేసుకుంది.  ఒక  సాధారణ వ్యక్తి, వృద్ధుడూ తనను చూడాలని కోరుకుంటున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. క్షణం ఆలోచించకుండా ఆ వృద్ధుడికి తనను కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చారు. వివరాల్లోకి వెడితే.. 

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని  ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో  సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.

దీంతో సీఎం చంద్రబాబు..  సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని ఆ పెద్దాయనకు  రిప్లై  ఇచ్చారు. అన్నట్లుగానే..  సోమవారం (జూన్ 8) మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వచ్చిన  సీఎం చంద్రబాబు...ఆ కార్యక్రమం అనంతరం సత్యనారాయణను తన బస్సులోకి   ప్రత్యేకంగా పిలుపించుకుని  ఆత్మీయంగా మాట్లాడారు.

కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని కూడా కోరారు.  వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు సత్యానారాయణ కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా  ఇచ్చారు. అంతే కాకుండా  సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను   ఆదేశించారు.

By
en-us Political News

  
126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతిలో సాంకేతిక మౌలిక వసతులను కల్పించడం, ఆర్థిక సేవల రంగాన్ని ఆధునీకరించడం, డిజిటల్ లావాదేవీలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంక్ అమరావతిలో ఇటువంటి అధునాతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఏపీ పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.