చంద్రబాబు థాయ్‌లాండ్ టూర్.. ఆ మీడియాకు అంత ఉలుకెందుకు?
Publish Date:Dec 29, 2021
Advertisement
థాయ్‌లాండ్‌కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో? అంటూ పెద్ద టైటిల్‌తో.. అదేదో చిదంబర రహస్యం బయటపెట్టినంత బిల్డప్‌తో జగన్ పత్రికలో వార్త రాశారు. ఫ్యామిలీతో కలిసి డిసెంబర్ 24న హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లారని.. జనవరి 2 వరకు అక్కడే ఉంటారంటూ ఆ వార్త సారాంశం. ఈ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారని.. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని.. తనదైన స్టైల్లో మసాలా కలిపారు. ఇంతకీ, చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లితే.. వైసీపీ మీడియాకు అంత ఉలుకెందుకనేది తమ్ముళ్ల ప్రశ్న. చంద్రబాబు రెగ్యులర్‌గా ఫ్యామిలీ ట్రిప్ వెళుతుంటారు. ఏడాదికోసారి అన్నట్టు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటన చేస్తుంటారు. ఏళ్లుగా ఇలా జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ.. ప్రతిపక్ష నేతగానూ.. అనేకసార్లు హాలిడే ట్రిప్ వేశారు చంద్రబాబు. 355 రోజులు నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే బాబు.. ఆ వారం-10రోజులే కాస్త రిలాక్స్ అయ్యేది. ఫుల్‌టైమ్ ఫ్యామిలీతో గడిపేది. ఇప్పటికే పలు దేశాలు చుట్టొచ్చారు. ఈసారి థాయ్‌లాండ్ వెళ్లారు అంతే. ఇంతే సింపుల్ న్యూస్ ఇది. కానీ, దేన్నైనా రాజకీయం చేయాలని చూసే ఓ మీడియా.. అంత రహస్యమెందుకో? అంటూ హెడ్డింగ్ పెట్టి రంధ్రాన్వేషణ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. జగన్‌లా విదేశాలకు వెళ్లాలంటే తమ అధినేతకు కోర్టు అనుమతి అవసరం లేదని.. మిస్టర్ క్లీన్ చంద్రబాబు ఎప్పుడైనా, ఎక్కడికైనా ఎలాంటి అనుమతులు లేకుండా స్వేచ్ఛగా వెళ్లొచ్చని అంటున్నారు. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలాంటి వాళ్లు మాత్రం కోర్టు పర్మిషన్ లేనిదే.. దేశం దాటలేరని గుర్తు చేస్తున్నారు. కోర్టు అనుమతి అంత ఈజీ కాదని తెలిసే.. ఇటీవల సీఎం జగన్ భార్యతో కలిసి డార్జిలింగ్ టూర్‌కు వెళ్లొచ్చారని అంటున్నారు. చంద్రబాబు జగన్‌లా సూట్‌కేసు కంపెనీలతో అక్రమాస్తులు కూడేసి సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవటం లేదని.. బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చి తిరగడం లేదని.. అందుకే, సేదతీరేందుకే కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారని.. అందులో రహస్యమేముందని కౌంటర్లు వేస్తున్నారు. జగన్ విదేశాలకు వెళితే ఏ కొల్లగొట్టిన సొమ్మో.. ఏ జగన్ ట్యాక్స్ సంపాదనో.. దాచేందుకు వెళ్లుంటారని అనుమానించాలి కానీ.. నిఖార్సైన చంద్రబాబుపై అనుమానాలు రేకెత్తించాలనే ఆ మీడియాది వృధా ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఆ మీడియా.. ఇకనైనా టీడీపీ నేతలపై బురదజల్లే కుతంత్రాలు ఆపాలని హితవు పలుకుతున్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-thailand-tour-targeted-by-jagan-media-39-129293.html





