ఢిల్లీకి చంద్రబాబు బృందం.. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కలవరం! 

Publish Date:Oct 23, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతున్న రాజకీయాలు ఢిల్లీకి చేరుతున్నాయి. వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఎంపీలతో సహా సుమారు పది మంది నేతలు ఈ బృందంలో ఉంటారు. 

రాష్ట్రపతి కోవింద్‌తో పాటు పలువురు పెద్దలను కలసి మాదకద్రవ్యాలు, వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రాష్ట్రపతి సోమవారం అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కోరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లను టీడీపీ బృందం కోరింది. వాళ్లను కూడా కలిసి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులపై ఫిర్యాదు చేయనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరపాలని కోరే అవకాశం ఉంది.

మంగళవారం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు నెల్లూరు, విశాఖ, గుంటూరు పార్టీ ఆఫీసులపై దాడికి పాల్పడ్డాయి. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి విద్వంసం స్పష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇండ్ల దగ్గర దాడులకు ప్రయత్నించాయి. ఈ ఘటనలతో ఏపీ ఉధ్రిక్తతంగా  మారింది. వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు బుధవారం రాష్ట్ర బంద్ నిర్వహించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 36 గంటల నిరసన దీక్ష చేశారు చంద్రబాబు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు దీక్షకు అనూహ్య స్పందన వచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం కిటకిటలాడింది. ఉదయం 6గంటలకు మొదలైన కార్యకర్తల రాక.. సాయంత్రానికి విపరీతంగా పెరిగిపోయింది. కార్యాలయం లోపల  కాలుమోపలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో మినీ మహానాడు మాదిరిగా మారిపోయింది. అమరావతి దళిత జేఏసీ కూడా ప్రదర్శనగా తరలివచ్చింది. దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీనే గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేసే అరాచక పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి దమ్ముంటే, పోలీసులు లేకుండా టీడీపీ కార్యాలయం వైపు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సవాల్‌ చేశారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ ఆఫీసు పై రాళ్లేసి.. ఉద్యోగులను కొట్టి వెళ్లడం కాదు.. దమ్ముంటే ఇప్పుడు రండి.. మా సత్తా చూపిస్తాం’ అని హెచ్చరించారు. 

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంద. అందుకే చంద్రబాబు దీక్షకు భారీ స్పందన వచ్చిందని, కరోనా భయపెడుతున్నా జనాలు భారీగా వచ్చి మద్దతు తెలిపారని చెబుతున్నారు. ఇదే స్పీడుతో జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రిని కలిసి ఏపీ పరిస్థితులను వివరించబోతున్నారు. టీడీపీ బృందం హస్తిన పర్యటనతో వైసీపీలో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్నపరిణామాలతో ఇప్పటికే చాలా డ్యామేజీ జరిగిందని, టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే తమకు ఇబ్బందులు తప్పవనే భయాందోళన జగన్ శిబిరంలో కనిపిస్తుందని అంటున్నారు. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.