చంద్రబాబు కంటే తోపు కాదుగా..

Publish Date:Feb 21, 2022

Advertisement

దేశ రాజకీయాలతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్న ఎవరికైనా, జాతీయ స్థాయిలో ప్రాతీయ పార్టీల కూటమి ఏర్పాటు అయ్యే పనికాదని అర్థం అవుతుంది. అయినా, ఇంచుమించుగా నాలుగు పదులకు పై బడిన రాజకీయ అనుభవం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసేఆర్’కు ఆ విషయంగా తెలియదా, అంటే తెలియకుండా ఉండే అవకాశమే లేదు. నిజానికి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి, ఆ మాట కొస్తే జనతా ప్రయోగంతో మొదలిన  జాతీయ, ప్రాంతీయ పార్టీల సంయుక్త మిశ్రమ కూటమి ప్రయత్నం మొదలు ఇంతవరకు జరిగిన ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. ఇందుకు చరిత్రలో చాలా చాలా ఉదాహరణలే ఉన్నాయి.నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ముదస్తు ఎన్నికలకు ముందు స్వయంగా కేసీఆరే అలాంటి విఫల ప్రయత్నం ఒకటి చేశారు. ఇప్పుడు మళ్ళీ మరో ...ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే, కేసీఆర్ కంటే ముందు, 2018లోనే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు కుడా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, మోడీని ఓడించడమే లక్ష్యంగా కలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగారు. ఇప్పుడు కేసీఆర్ కలిసిన కలవనున్నప్రాంతీయ పార్టీలనాయకులనే కాదు, జాతీయ శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, అరవింద్ కేజ్రివాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్,మయావతి, మమతా బెనర్జీ, ఇంకు చాలా మంది నాయకులను కలిశారు. చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీల  కూటమి ఏర్పాటకు చాలా చాలా ప్రయత్నం చేశారు. అయినా ఆయన  ప్రయత్నాలు ఫలించలేదు. 

నిజానికి, చంద్రబాబు నాయుడుపోలిస్తే కేసీఆర్’ కు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, చాలా తక్కువ.తెలుగు దేశం పార్టీతో పోలిస్తే,తెరాసకు జాతీయ ఉన్న గుర్తింపు ఇంకా తక్కువ. చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, యూపీఎ, ఎన్డీఎ.. ఇలా ... 2014కు ముందు 30 ఏళ్ళపాటు జాతీయ రాజకీయాలలోఅవిశ్చరణంగా సాగిన సంకీర్ణ యుగంలో చక్రం తిప్పిన అనుభవం చంద్రబాబుకున్నాయి. అంటినీ మించి, చంద్రబాబుకున్న విశ్వసనీయత కేసీఆర్’ లో కాగడా పెట్టి వెతినకినా కనిపించదు. 

నిజానికి చంద్రబాబు మాత్రమే కాదు, 2019 లోక్ సభ ఎన్నికలకు  సోనియా నుంచి సీతారామ్ ఏచూరి వరకు , మాయావతి నుంచి నుంచి మమతా బెనర్జీ వరకు రాహుల్ గాంధీ నుంచి రాజా (సిపిఐ) వరకు కేజ్రీవాల్ నుంచి ఇంకో మహా నాయకుని వరకు, ఇలా నేఅక్ మంది నాయకులను కూడా చంద్రబాబు కలిశారు. 2018లో బెంగుళూరులో జరిగిన జేడీఎస్ నేత కుమర్ స్వామి ప్రమాణ స్వీకార్యానికి హాజరైన నాయకులు అందరితోనూ, చంద్రబాబు చేతులు కలిపారు.చివరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపారు. అయినా, ఏమైందో అందరికి తెలిసిన చరిత్ర.  ఈ చరిత్ర నేపధ్యంగా కేసీఆర్ కంటున్న కలలు ఫలిస్తాయా? చంద్రాబాబు కంటే తోపు కాదుగా నే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్’కు విశ్వసనీయత లేదని అంటున్నారు, రాజకీయ పరిశీలకులు. నిజానికి ఏమున్నా లేక పోయినా విశ్వసనీయత లేకపోతే లాభం లేదని అంటున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లేకుండా, కేసీఆర్ ఒక్కరే కాదు, .. మమతా బెనర్జీ సహా ఏ ఒక్కరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలేరని, అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.